లైఫై.. వైఫై కంటే 100 రెట్ల వేగం

  సంప్రదాయ వైఫై కంటే 100 రెట్లు అధిక వేగంతో అంతర్జాల సౌకర్యాన్ని అందించే సాంకేతిక విధానం అందుబాటులోకి వచ్చింది. 'లైఫై'గా పిలుస్తున్న ఈ సాంకేతికతను వెల్మెనీ అనే సంస్థ ఇప్పటికే పరీక్షించింది. లైఫై సహాయంతో 1 గిగాబైట్‌ వేగంతో సమాచార మార్పిడి సాధ్యమవుతుంది. సాధారణ వైఫై కనెక్షన్లతో పోల్చితే ఇది 100 రెట్ల వేగం. దీనిసహాయంతో అంతర్జాలం నుంచి హెచ్‌డీ వీడియోలు, ఆల్బమ్స్‌ వంటివి కూడా సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దృగ్గోచర కాంతి ప్రసరణం(విజిబుల్‌ లైట్‌ కమ్యూనికేషన్‌-వీఎల్‌సీ) విధానంలో ఎల్‌ఈడీ దీపాల కాంతి తరంగాలతో నెట్‌వర్క్స్‌ మధ్య డాటా బదిలీ అవుతుంది. కానీ, ఇంత వేగవంతమైన అంతర్జాల సదుపాయం కల్పించే లైఫైలో అతిపెద్ద పరిమితి కూడా ఉంది. దృగ్గోచర కాంతిని ఉపయోగించుకుని డాటా బదిలీ చేసే విధానం కావడంతో గోడల్లోంచి ఈ తరంగాలు ప్రసరించవు. వేగవంతమైన, సురక్షితమైన విధానంగా మాత్రం ఇది ప్రస్తుత వైఫైల కంటే మేలైనది. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు హెరాల్డ్‌ హాస్‌ ఈ కొత్త విధానానికి ఆద్యుడు.. 2011లో ఆయన దీనికి లైఫైగా నామకరణం చేశారు. మూణ్నాలుగేళ్లలో ఈ సాంకేతికత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్మెన్ని సంస్థ సీఈఓ దీపక్‌ సోలంకి చెబుతున్నారు.

  ఇక నుంచి వెబ్‌ వాట్సాప్‌లోనూ ఆప్షన్లు

  హైదరాబాద్‌: మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సాప్‌ మొబైల్‌తో పాటు కంప్యూటర్లలోనూ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే మొబైల్‌ వాట్సాప్‌లో ఉన్నన్ని ఆప్షన్లు కంప్యూటర్‌లోని వాట్సాప్‌లో అప్‌డేట్‌ అవడం లేదు. కంప్యూటర్‌ ద్వారా వాట్సాప్‌ వినియోగించేవారు ప్రొఫైల్‌ పిక్‌, స్టేటస్‌ మార్చుకోడానికి వీలుండేది కాదు. మెసేజ్‌లు కూడా తొలగించుకునే సదుపాయం లేదు. దీంతో వినియోగదారుల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో కంప్యూటర్‌ వాట్సాప్‌ను మొబైల్‌లో లాగే అప్‌డేట్‌ చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని ద్వారా కంప్యూటర్‌ ద్వారా వాట్సాప్‌ను వినియోగించేవారు ఎలాంటి ఎడిటింగ్‌ అయినా చేసుకోవచ్చు. అంటే ప్రొఫైల్‌ ఫొటో, స్టేటస్‌ మార్చుకోవచ్చు. అంతేగాక మెసేజ్‌లు డిలీట్‌ చేసుకోవచ్చు. గ్రూప్‌ నుంచి తొలగిపోయే సదుపాయం కూడా కల్పించారు. కంప్యూటర్‌ మౌస్‌ రైట్‌ క్లిక్‌ లేదా సంబంధిత మేసేజింగ్‌ నంబర్‌ దగ్గరున్న రెడ్‌ బటన్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఈ మార్పులను చేసుకోవచ్చు.

  ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్‌ చిప్‌..

  హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతిచిన్న కంప్యూటర్‌ చిప్‌ను తయారుచేసినట్లు ప్రముఖ మైక్రోచిప్‌ తయారీ సంస్థ ఐబీఎం ప్రకటించింది. మనిషి వెంట్రుక కన్నా సన్నగా ఉండే ఈ చిప్‌ను సునీ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహాయంతో రూపొందించినట్లు ఐబీఎం తెలిపింది. 7 నానోమీటర్ల మందం ఉండే ఈ చిప్‌ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఐబీఎం వివరాలు వెల్లడించలేదు. మైక్రోచిప్స్‌లో ప్రస్తుతం 22, 14 నానోమీటర్ల మందమైనవి మార్కెట్లో లభిస్తున్నాయి.

  ఆ కంప్యూటర్‌ తెరలను మడతపెట్టేయొచ్చు..

  టోక్యో: భవిష్యత్తులో కంప్యూటరు తెర(స్క్రీన్‌)ల రూపు మారనుంది. మడతపెట్టడానికి వీలైన అతి పలుచని కంప్యూటరు తెరల తయారీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త తరం ట్రాన్సిస్టర్ల అభివృద్ధికి చేస్తున్న అధ్యయనాలు ఇందుకు వీలు కల్పిస్తున్నాయి. కర్బన క్షేత్ర ప్రభావ ట్రాన్సిస్టర్లు(ఓఎఫ్‌ఈటీ)లకు సంబంధించి జపాన్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా వంచడానికి వీలైన, తక్కువ ఖరీదు ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీకి ఓఎఫ్‌ఈటీలను వినియోగిస్తారు. దశాబ్దం కిందట ఓఎఫ్‌ఈటీలను అభివృద్ధి చేసి రూపొందించిన కాంతి ఉద్గారక కర్బన క్షేత్ర ప్రభావ ట్రాన్సిస్టర్లు(ఎల్‌ఈఓఎఫ్‌ఈటీ)ను ఇప్పుడు మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి అత్యాధునిక ఎల్‌ఈఓఎఫ్‌ఈటీలను ఉపయోగించి పారదర్శకమైన, పలుచని, వంచడానికి వీలైన కంప్యూటరు తెరల తయారుచేయనున్నారు. ఇవి బలహీనమైన ఎలక్ట్రానిక్‌ సంకేతాలను సైతం మెరుగుపరిచే కర్బన అర్ధ వాహకాలతో సత్వరం స్పందిస్తాయి. తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటూ ఇవి పనిచేస్తాయి.

  కంప్యూటర్లకు కీబోర్డే తాళం!

  వాషింగ్టన్‌: కంప్యూటర్ల సంకేతనామాన్ని (పాస్‌వర్డ్‌) హ్యాకర్లు ఛేదించి, సమాచారాన్ని తస్కరిస్తుండటం కొత్తేమీ కాదు. ఇకపై అలాంటి భయమేమీ అక్కర్లేదేమో. ఎందుకంటే తనకు తానుగా శుభ్రం చేసుకునే, సొంతంగా విద్యుత్తును సృష్టించుకునే అధునాతన కీబోర్డును జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ఝాంగ్‌ లిన్‌ వాంగ్‌, బృందం రూపొందించింది. మీటలపై పడే ఒత్తిడి, వేగం వంటి టైప్‌ చేసే తీరును బట్టి కంప్యూటర్‌ వినియోగదారులను గుర్తించగలదు కూడా. దీంతో ఒకవేళ ఎవరికైనా ఇతరులకు పాస్‌వర్డ్‌ తెలిసినా టైప్‌ చేసే విధానం భిన్నంగా ఉంటుంది కాబట్టి కంప్యూటర్‌ను వాడుకోవటం సాధ్యం కాదు.

  వెబ్‌ బ్రౌజర్‌ ద్వారా 'వాట్సాప్‌' సంక్షిప్త సందేశాలు

  దిల్లీ: ప్రముఖ సమాచార యాప్‌ వాట్సాప్‌.. కొత్తగా వెబ్‌ బ్రౌజర్‌ రకాన్ని విడుదల చేసింది. దీంతో స్మార్ట్‌ఫోన్లతోనే కాదు.. కంప్యూటర్ల ద్వారా కూడా వాట్సాప్‌ను వాడుకోవటానికి వీలవుతుంది. ''తొలిసారిగా ఈరోజు మీ వెబ్‌ బ్రౌజర్లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు'' అని వాట్సాప్‌ తన బ్లాగులో తెలిపింది. వాట్సాప్‌ను వెబ్‌ బ్రౌజర్‌తో అనుసంధానం చేయడానికి గూగుల్‌ క్రోమ్‌లోకి వెళ్లి.. web.whatsapp.comను ఓపెన్‌ చేయాలి. తర్వాత వాట్సాప్‌లోని 'క్యూఆర్‌' సంకేతాన్ని స్కాన్‌ చేయాలి. ''ఈ వెబ్‌రూపం పనిచేయటానికి ఫోన్‌ ఇంటర్‌నెట్‌తో అనుసంధానమై ఉండాలి. అలాగే ఫోన్లలో వాట్సాప్‌ తాజా రూపం నిక్షిప్తమయ్యేలా చూసుకోవాలి'' అని వాట్సాప్‌ చెప్పింది.

  వైర్‌ లేకుండానే ఫోన్‌ ఛార్జింగ్‌

  వాషింగ్టన్‌: వైర్‌ లేకుండానే మీ ఫోన్‌ బల్లపై పెడితే ఛార్జింగ్‌ అయితే ఎలా ఉంటుంది. చైనాలోని 'మైక్రోసాఫ్ట్‌ రిసెర్చ్‌' ఈ విధానాన్ని అభివృద్ధి పరిచింది. పైకప్పులో అమర్చిన కెమెరా, ఫోన్‌ను గుర్తించే పరికరం.. బల్లపై ఉన్న వస్తువులను స్కాన్‌ చేస్తుంది. ఫోన్‌ను గుర్తించిన వెంటనే కాంతి కిరణాలను దానిపైకి ప్రసరింపచేస్తాయి. ఫోన్‌లోని ఫొటో వోల్టాయిక్‌ ఘటాలు ఆ కాంతి కిరణాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తాయి.

  క్వాంటమ్‌ కంప్యూటర్ల దిశగా ముందడుగు

  వాషింగ్టన్‌: భౌతిక శాస్త్రవేత్తలను కొన్ని దశాబ్దాలుగా కొరుకుడు పడకుండా ఉన్న ఒక పదార్థం గుట్టును శాస్త్రవేత్తలు ఎట్టకేలకు విప్పారు. ఇది క్వాంటమ్‌ కంప్యూటర్లు, కొత్త తరం ఎలక్ట్రానిక్స్‌ దిశగా మార్గాన్ని సుగమం చేస్తుందని వారు తేల్చారు. సమారియం హెక్సాబోరైడ్‌ అనే పదార్థం దాదాపు నాలుగు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉంది. తాజాగా అమెరికాలోని మిషిగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన సాగించి దాన్ని 'టోపోలాజికల్‌ ఇన్సులేటర్‌'గా వర్గీకరించారు. ఈ పదార్థాలు.. పైభాగంలో లోహం తరహాలో విద్యుత్‌ను గ్రహిస్తాయి. లోపలిభాగంలో మాత్రం రబ్బర్‌ లాగా విద్యుత్‌ను నిరోధిస్తాయి. ఈ పదార్థంలో రసాయన తీరు తెన్నులు ఆసాంతం ఒకేలా ఉన్నప్పటికీ ఇలా రెండు రకాల లక్షణాలను ప్రదర్శించడం విశేషం. తాజాగా శాస్త్రవేత్తలు టార్క్‌ మ్యాగ్నెటోమెట్రీ అనే విధానాన్ని ఉపయోగించి సమారియం హెక్సాబోరైడ్‌ను పరీక్షించారు. అయస్కాంత క్షేత్రానికి స్పందనగా అందులో ప్రకంపనలు ఎలా జరుగుతున్నాయో చూశారు. ఈ పదార్థం ఉపరితలంపై అరుదైన డైఆర్క్‌ ఎలక్ట్రాన్లు ఉన్నట్లు గుర్తించారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ దిశగా ఉన్న అవరోధాన్ని అధిగమించడంలో ఇవి సాయపడతాయని తేల్చారు.
  సమారియం హెక్సాబోరైడ్‌పై మరింత లోతుగా పరిశోధనలు సాగించడం ద్వారా ఈ పదార్థాన్ని క్వాంటమ్‌ కంప్యూటర్లలో ఎలక్ట్రిక్‌ కరెంట్‌ను ప్రవహింపచేయడానికి ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. సంప్రదాయ ఎలక్ట్రానిక్స్‌లో సిలికాన్‌ను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. క్వాంటమ్‌ శకంలో ఆ పాత్రను సమారియం హెక్సాబోరైడ్‌ చేపట్టే అవకాశం ఉందన్నారు. క్వాంటమ్‌ కంప్యూటర్లు.. ప్రాసెసింగ్‌, మెమరీ వంటి పనుల కోసం పరమాణువులు, ఎలక్ట్రాన్లు వంటి వాటిని ఉపయోగించుకుంటాయి. అనేక గణితాలను ఏకకాలంలో చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది.

  ప్రాచీన కంప్యూటర్‌ ఇంకా పాతదట!

  వాషింగ్టన్‌: 'ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన కంప్యూటర్‌' చెప్పే 'అంతికైతెరా మెకానిజం' ఇప్పటివరకు వూహించిన దానికంటే ప్రాచీనమైనదిగా ఓ అధ్యయనంలో తేలింది. ప్రాచీన కాలంలో ఖగోళ స్థితిగతులను, గ్రహణాలను దీని ద్వారా అంచనా వేసేవారు. ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం..అది క్రీస్తుపూర్వం 125 నాటిదిగా భావించారు. కానీ తాజాగా చేసిన అధ్యయనంలో అది క్రీస్తుపూర్వం 205 నాటిదిగా భావిస్తున్నారు. 1901లో గ్రీకు ఓడ పగిలిపోయిన భాగాల్లో నుంచి దీనిని కనుగొన్నారు.

  ఫోన్‌ను చేతికి చుట్టుకోవచ్చు

  వాషింగ్టన్‌: చేతికి వాచీలాగా చుట్టుకోవటానికి వీలయ్యే స్మార్ట్‌ఫోన్‌ను అమెరికన్‌ నిపుణులు తయారుచేశారు. ఆరు అంగుళాల తెరతో ఉండే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఆధారంగా పని చేస్తుంది. నీటి నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేగాక దీనిమీద పగుళ్లు కూడా పడవు. ఈ ఫోన్‌లో రెండు జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీస్పేస్‌ ఉంటాయి. వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జింగ్‌ చేయవచ్చు. ఈ కొత్తతరం ఫోన్‌కు 'పోర్టల్‌' అనే పేరు పెట్టారు. ప్రస్తుతం దీని నమూనాను తయారుచేశారు. దీంట్లో ఫోన్‌, గడియారం, శారీరక దృఢత్వాన్ని తెలియజేసే ఫిట్‌నెస్‌ ట్రాకర్‌, నాలుగు కెమెరాలున్నాయి. తగిన నిధులను సమీకరించిన తర్వాత పోర్టల్‌ను భారీస్థాయిలో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

  సైబర్‌ దాడుల నివారణకు సరికొత్త ఉచిత సాఫ్ట్‌వేర్‌

  బెర్లిన్‌: సైబర్‌ దాడులను నివారించేందుకు తోడ్పడే ఒక సరికొత్త ఉచిత సాఫ్ట్‌వేర్‌ను జర్మనీలోని 'మ్యూనిచ్‌ సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం(టీయూఎం)' పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిని టీసీపీ స్టెల్త్‌ రక్షణ సాఫ్ట్‌వేర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా తమ నియంత్రణలోకి తెచ్చుకోగలిగిన దుర్బల సర్వర్లను గుర్తించేందుకు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నిఘా సంస్థలు హాసియండా అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయని టీయూఎం పరిశోధకులు తెలిపారు. దీనితోపాటు ఇలాంటి ఇతర సాఫ్ట్‌వేర్‌లతో సైబర్‌ దాడులకు జరిగే ప్రయత్నాలను తమ సాఫ్ట్‌వేర్‌ అడ్డుకోగలదని చెప్పారు.

  సమాచార వేగంలో కొత్త రికార్డు

  లండన్‌: ఒక ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా సెకనుకు 43 టెరాబిట్ల వేగంతో సమాచారాన్ని పంపించి డెన్మార్క్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు సంచలనం సృష్టించారు. దీనికోసం వీరు ఒక కొత్తరకం ఆప్టికల్‌ ఫైబర్‌ను ఉపయోగించారు. ఇంటర్నెట్‌లో ఏటా సమాచారం 40-50 శాతం చొప్పున పెరిగిపోతున్న దృష్ట్యా.. సమాచార పంపిణీ వేగాన్ని అదే స్థాయిలో పెంచటం అన్నది ఒక సవాల్‌గా మారింది. మరోవైపు, ఇంటర్నెట్‌ కోసం ఉపయోగించే శక్తి (కరెంటు తదితర) ఉత్పత్తి కోసం వాతావరణంలోకి భారీ ఎత్తున కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. మానవ ప్రమేయంతో విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో ఇంటర్నెట్‌ రంగానికి సంబంధించినవి రెండుశాతానికిపైగా ఉంటున్నాయి. ఇవి రవాణారంగం విడుదల చేసే ఉద్గారాలకు సమానం. కానీ, రవాణారంగం ఇంటర్నెట్‌లాగా ఏటా 40-50 శాతం చొప్పున పెరగటం లేదు. ఈ నేపథ్యంలో, నెట్‌ ద్వారా విడుదలయ్యే ఉద్గారాలను తగ్గిస్తూనే.. అవసరాలకు అనుగుణంగా దానివేగాన్ని పెంచాల్సి వస్తోంది. దీనికోసం డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు కొత్తరకం ఆప్టికల్‌ ఫైబర్‌ను ఉపయోగించారు.

  వైఫైని తలదన్నే లైఫై

  వాషింగ్టన్‌: వైఫై టెక్నాలజీకి ప్రత్యామ్నాయంగా మరింత మెరుగైన లైఫై టెక్నాలజీకి మెక్సికో శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఎల్‌ఈడీ లైట్ల నుంచి విడుదలైన కాంతి వర్ణపటం ద్వారా ఆడియో, వీడియో, ఇంటర్నెట్‌ను ప్రసారం చేయగలిగారు. సెకనుకు 10 గిగాబైట్ల వేగంతో ఈ సమాచారాన్ని పంపించటంలో వీరు విజయం సాధించారు. వైఫైతో పోల్చితే లైఫై ద్వారా అనేకరెట్ల వేగంతో సమాచారాన్ని ప్రసారం చేయటానికి సాధ్యమవుతుంది. దీనివల్ల ఇంటర్‌నెట్‌ వినియోగాన్ని మరింత విస్తృతపరచవచ్చు. పైగా లైఫై ద్వారా ప్రసారమయ్యే ఇంటర్నెట్‌ను హ్యాకర్లు అడ్డుకోవటానికి అవకాశం ఉండదు. ఈ విధంగా భద్రతపరమైన సవాళ్లను అధిగమించవచ్చు.

  మనకూ మరింత వేగం..!

  ఈనాడు, హైదరాబాద్‌: మరి కొన్ని రోజులు అగితే ఈ సేవలు మన రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌లో కొత్త తరం 4జీ ఈ ఏడాది ఆఖరుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకూ విస్తరించనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు 41 పట్టణాల్లో ఈ సేవలు ప్రారంభించేందుకు మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు పనుల్ని ముమ్మరం చేశాయి. 4జీతో సెకనుకు 100 ఎంబీ వేగంతో ఇంటర్నెట్‌ లభిస్తుంది. దీంతో అప్లికేషన్లు, వీడియోలు, పాటలు డౌన్‌లోడ్‌ వేగం పెరుగుతుంది. దేశ, విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులతో మరింత స్పష్టంగా వీడియో ఛాటింగ్‌ చేసుకోవచ్చు. అంతర్జాల ఆధారిత కాల్స్‌ కూడా పెరుగుతాయి. దీంతో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా కాల్స్‌ చేసుకొనే సౌలభ్యం కలగనుంది. ప్రస్తుతం 1 జీబీ డేటా టారిఫ్‌ రూ.145 ఉండగా.. 4జీ సేవలు అందుబాటులోకి వస్తే దీని ఖర్చు రూ.35కు తగ్గే అవకాశమున్నట్లు అంచనా. ముందు కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో స్కైప్‌, గూగల్‌ హ్యాంగవుట్‌, వియ్‌ఛాట్‌, ఫేస్‌టైమ్‌ తదితర యాప్‌లతో వీడియో కాల్‌ చేయవచ్చు. అలాగే వాయిస్‌ సౌకర్యం అందిస్తున్న వైబర్‌, నింబుజ్‌, ఫ్రింగ్‌ ద్వారా ఆడియో కాల్స్‌లో ఆటంకాలు లేకుండా మాటలు చక్కగా వినబడుతాయి.
  టెక్నాలజీతరం - గరిష్ఠ డౌన్‌లోడ్‌ స్పీడు
  2జీ 100-300 కేబీ
  3జీ - 8 ఎంబీ
  4జీ - 100 ఎంబీ
  (కఠిన సమయంలోనూ 4జీ నెట్‌వర్క్‌తో సెకనుకు 15ఎంబీ వేగం సాధ్యం).

  ఇక స్కైప్‌ సంభాషణలూ తర్జుమా

  రాంచో పాలోస్‌ వెర్డెస్‌ (కాలిఫోర్నియా): స్కైప్‌ ద్వారా మాట్లాడుకునే మాటలను తక్షణం ఇతర భాషల్లోకి తర్జుమా చేసే పరిజ్ఞానాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తొలిసారిగా ప్రదర్శించింది. దీని పేరు స్కైప్‌ ట్రాన్స్‌లేటర్‌. కాలిఫోర్నియాలోని రాంచో పాలోస్‌ వెర్డెస్‌లో జరిగిన కోడ్‌ కాన్ఫరెన్స్‌ టెక్నాలజీ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల దీన్ని ప్రదర్శించి చూపారు. వివిధ భాషల్లో మాట్లాడేవారి మాటలను తమకు అర్థమయ్యే భాషలో వినటానికి ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. భాషా పరమైన అడ్డంకులేవీ లేకుండా ఎవరితోనైనా మాట్లాడటానికి ఇది వీలు కల్పిస్తుందని వివరించారు. ఇందులో వినియోగించిన పరిజ్ఞానాన్ని ఆయన 'అద్భుతం' అని వర్ణించారు. పరిశోధన స్థాయి నుంచి దీనికి వాస్తవ రూపం కల్పించటం ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని.. వచ్చే ఏడాది చివర్లో దీన్ని విడుదల చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే స్కైప్‌ వినియోగదారులకు దీన్ని ఉచితంగా అందుబాటులోకి తెస్తారా? అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందా? అనేది మాత్రం వెల్లడించలేదు.

  లావా కిట్‌క్యాట్‌ స్మార్ట్‌ఫోన్‌

  ఈనాడు, హైదరాబాద్‌: ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ 4.4.2 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్లు వరుసగా విపణిలోకి వస్తున్నాయి. దేశీయ సంస్థ లావా కూడా ఐరిస్‌ శ్రేణిలో ఎక్స్‌1 మోడల్‌ 3జీ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 4.5 అంగుళాల తాకేతెర, 1.2 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 4జీబీ అంతర్గత మెమొరీ, వెనుక-ముందు 8-2 మెగాపిక్సెల్‌ కెమెరా, 1800 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ను రూ.7,999కి విక్రయిస్తామని సంస్థ తెలిపింది.

  చంద్రుడిపై హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్!

  వాషింగ్టన్: భవిష్యత్‌లో చంద్రుడిపై నివాసం ఉండి, పనిచేసుకోవాలనుకునే వారు.. భూమిపై జరిగే ముఖ్యమైన అంశాలను కోల్పోతున్నామని బాధపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే.. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా వారు భూలోకవాసులకు అందుబాటులో ఉండొచ్చు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన లింకన్ లేబొరేటరీ, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అంతరిక్షవాసులకు కనెక్టివిటీ అందించే డేటా కమ్యూనికేషన్ పరిజ్ఞానాన్ని తొలిసారిగా ఆవిష్కరించారు. దీనిద్వారా భారీ స్థాయిలో డేటా బదిలీలు, హైడెఫినిషన్ వీడియోలు పంపడానికి వీలవుతుందని తేల్చారు. ఇది లేజర్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇది ప్రసార వేగానికి సంబంధించి ఇప్పటివరకూ ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. వచ్చే నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే ఒక సదస్సులో ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తివివరాలను శాస్త్రవేత్తలు వెల్లడించనున్నారు. నిజానికి గత ఏడాది ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

  సల్‌ఫోన్ కెమెరాతో 'రక్తపరీక్ష'

  లండన్: వైద్యపరికరాల్లో ఉండే ఉన్నతస్థాయి సాంకేతికతను సాధారణ సెల్‌ఫోన్ల వద్దకు కూడా తీసుకొస్తే అది విస్తృతప్రయోజనాలను అందిస్తుంది. సర్రే విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటువంటి ప్రయత్నం చేశారు. వీరు ఒక కొత్త 'మల్టీస్పెక్ట్రల్ లైట్ సెన్సర్'ను రూపొందించారు. దీనిసాయంతో తయారుచేసే సెల్‌ఫోన్ కెమెరా ఒక వైద్యపరికరంగా పని చేయగలదు. చర్మం కింద రక్తనాళాల్లో ఉన్న రక్తం ఆరోగ్యకరంగా ఉందా? లేదా? కణజాలం ఎలా ఉంది? వంటి వివరాలను ఈ కెమెరా ద్వారా మనంతటమనమే పరిశీలించుకోవచ్చు. ఆ వివరాలను నెట్‌ద్వారా వైద్యనిపుణులకు పంపించి.. వారి సలహాలను తీసుకోవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే.. మల్టీస్పెక్ట్రమ్ లైట్‌సెన్సర్.. అతినీలలోహిత కిరణాల నుంచి పరారుణ కిరణాల సమీపస్థాయి ఉన్న కాంతి వరకూ పూర్తి స్పెక్ట్రమ్‌ను పరిశీలించగలుగుతుంది. దీనివల్ల కణజాలం లోపల ఏముందున్నది స్పష్టంగా చూడటం సాధ్యమవుతుందని, కణతులు వంటివి ఉంటే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించటానికి వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సెన్సర్లను సాధారణ లేజర్ ప్రింటర్ల ద్వారా చవకగా తయారుచేయవచ్చన్నారు.

  21 భాషల్లో మైక్రోమ్యాక్స్‌ యునైట్‌ 2

  ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు సహా 19 ప్రాంతీయ భాషలు, హిందీ, ఆంగ్లంలోనూ వినియోగించేందుకు వీలున్న డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ యునైట్‌ 2ను మైక్రోమ్యాక్స్‌ విపణిలోకి విడుదల చేసింది. 4.7 అంగుళాల ఐపీఎస్‌ తాకేతెర, 1.3 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, వెనుక-ముందు 5-2 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 4 జీబీ అంతర్గత మెమొరీ, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ 4.4.2 ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)తో పనిచేస్తుంది. ఫోటా సాయంతో ఓఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం ఉంది. 4 రంగుల్లో లభించే ఈ ఫోన్‌ మెమొరీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. దేశీయ అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్లు, ఫీచర్లు నిక్షిప్తం చేసినట్లు సంస్థ ప్రకటించింది. హ్యాంగ్‌అవుట్స్‌ ద్వారా వీడియోకాల్స్‌ చేసుకోవచ్చని, ఎంయాడ్‌ ద్వారా ప్రకటనలు చూసి అదనపు టాక్‌టైం పొందవచ్చని, కింగ్‌సాఫ్ట్‌ ఆఫీస్‌ ద్వారా సినిమాహాళ్లు, హోటళ్లు, ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపారు. ఆదరణ పొందిన కొన్ని గేమ్స్‌ పొందుపరచిన ఈ ఫోన్‌ను రూ.6,999కి విక్రయిస్తున్నట్లు తెలిపారు.

  ట్విట్టర్‌లో హ్యాకర్లకు కళ్లెం

  వాషింగ్టన్‌: ట్విట్టర్‌ వంటి సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ల ద్వారా లేనిపోని పుకార్లను పుట్టిస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో అనేకం జరుగుతున్నాయి. ఈ రకమైన అక్రమాల్లో మనుష్యులకన్నా సాఫ్ట్‌వేర్ల పాత్రే అధికం. హ్యాకర్లు రకరకాల సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తూ.. తప్పుడు సమాచారాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో పెడుతుంటారు. దీనికి విరుగుడుగా, ఇండియానా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచారు. దీనికి 'బోట్‌ఆర్‌నాట్‌' అని పేరు పెట్టారు. ట్విట్టర్‌ ఎకౌంట్‌ను ఏదైనా సాఫ్ట్‌వేర్‌ నిర్వహిస్తోందా? లేక మనిషే నిర్వహిస్తున్నారా? అని తెలుసుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పరిశోధకులు తెలిపారు. ట్విట్టర్‌ ఎకౌంట్‌ ఒపెన్‌కాగానే బోట్‌ఆర్‌నాట్‌.. ఆ ఎకౌంట్‌లో ఉన్న సమాచారం ఏమిటి? ఎవరెవరితో సమాచార సంబంధాలు కొనసాగుతున్నాయి? ఏ సమయంలో ఎకౌంట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? వంటి వెయ్యిరకాల అంశాలను పరిశీలిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా ఎకౌంట్‌ను నడుపుతున్నది మనిషా? సాఫ్ట్‌వేరా? అన్నదానిపై బోట్‌ఆర్‌నాట్‌ ఒక నిర్ణయానికి వస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన అలెస్సాండ్రో ఫ్లామ్మిని తెలిపారు. దీనిసాయంతో ట్విట్టర్‌లో హ్యాకర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

  మోటో ఇ

  న్యూఢిల్లీ: మోటరోలా భారత్‌లో అత్యంత చౌకైన యాండ్రాయిట్‌ కిట్‌క్యాట్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో ఇ యాండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 1.2 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌ కోర్‌, 1 జీబీ ర్యామ్‌, 4 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ(32 జీబీ దాకా పెంచుకునే సౌలభ్యం ఉంది), 1980 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్‌, 5 ఎమ్‌పీ కెమేరా వంటి ఫీచర్లు దీని సొంతం.

  సోనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ 'ఎక్స్‌పీరియా జెడ్‌2'

  న్యూఢిల్లీ: దేశీయ విపణిలోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ 'ఎక్స్‌పీరియా జెడ్‌2'ను సోనీ విడుదల చేసింది. దీని ధర రూ.49,990. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ మీద పని చేస్తుంది. 5.2 అంగుళాల ట్రైలుమినోస్‌ డిస్‌ప్లే, 2.3 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌ కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 3జీబీ రామ్‌, 16 జీబీ బిల్ట్‌-ఇన్‌ స్టోరేజీ, 20.7 మెగాపిక్సిల్‌ రేర్‌ కెమేరా తదితరాలు ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. స్మార్ట్‌ బ్యాండ్‌ ఎస్‌డబ్ల్యూఆర్‌10ను కూడా సోనీ ప్రవేశపెట్టింది. దీని ధర రూ.5,990..

  ఫోన్‌లోనే ల్యాప్‌టాప్‌

  టోరంటో: కెనడా శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ చూడటానికి ఫోన్‌లాగే ఉన్నా.. దీనిని తెరిస్తే దాంట్లో ఉన్న మూడు తెరలు (డిస్‌ప్లేలు) విచ్చుకొని ల్యాప్‌టాప్‌గా మారిపోతుంది. ఈ తెరలను కావాలంటే ఫోన్‌తో అనుసంధానించుకోవచ్చు. లేదంటే, విడిగా కూడా పెట్టుకోవచ్చు. ప్రతీ డిస్‌ప్లేను దేనికదే విడిగా నోట్‌బుక్‌లాగా, మడవటానికి వీలయ్యే మ్యాప్‌లాగా వాడుకోవచ్చు. మూడింటినీ కలిపి అనుసంధానించి ఒకటిగాకానీ ఉపయోగించుకోవచ్చు. దీనికి వీలుగా ఫోన్‌లో కమాండ్స్‌ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పేపర్‌ఫోల్డ్‌ అనే పేరు పెట్టారు. దీనిని టోరంటోలో జరిగిన సాంకేతిక ప్రదర్శనలో ఆవిష్కరించారు.

  లెనోవో స్మార్ట్‌ఫోన్‌

  బెంగళూరు: భారత విపణిలోకి ఎస్‌ శ్రేణిలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో తీసుకొచ్చింది. 'ఎస్‌ 860' పేరుతో వస్తున్న దీని ధర రూ.21,500. డ్యూయల్‌ సిమ్‌, వెనుకవైపు 8 మెగాపిక్సెల్‌ కెమేరా, 16 జీబీ మెమొరీ సామర్థ్యం, 1.3 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌తో పనిచేసే ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 2జీబీ రామ్‌, ఒక్కసారి ఛార్జింగ్‌తో 43 గంటల పాటు వచ్చే బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

  ఇంటెక్స్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

  న్యూఢిల్లీ: ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ కొత్త టచ్‌ అండ్‌ టైప్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ 'ఆక్వా క్వెర్టీ' ధర రూ.4,990. ఈ హ్యాండ్‌సెట్‌లో ఒక టచ్‌ ఆధారిత స్క్రీన్‌, ఒక టైపింగ్‌ చేసే క్వర్ట్‌ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది. డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం గల ఈ ఫోన్‌లో 3.5 అంగుళాల తెర, 1.2 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌, 4.2.2 జెల్లీబీన్‌ ఓస్‌, 1500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 512 ఎమ్‌బీ ర్యామ్‌; 4 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ(32 జీబీ దాకా పెంచుకునే అవకాశం); 5 మెగా పిక్సల్‌ కెమేరా(వెనుక); ఒక వీజీఏ కెమేరా(ముందు) వంటివి ఉన్నాయి.

  రైలు సమాచారం చెప్పే యాప్‌

  న్యూఢిల్లీ: రైలు ఏ సమయానికి చేరుకుంటుంది.. ఎప్పుడు బయలుదేరుతుందనే సమాచారం మొబైల్‌ ఫోన్లోనే తెలుసుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక అప్లికేషన్‌(యాప్‌) రూపొందించింది. ఆ శాఖకు చెందిన సాంకేతిక విభాగం రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం(సీఆర్‌ఐఎస్‌) దీన్ని ప్రారంభించింది. దీంతోపాటు విండోస్‌ 8 ఓఎస్‌(ఆపరేటింగ్‌ సిస్టమ్‌)పై పనిచేసే కంప్యూటర్ల కోసం ఓ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్‌ సహకారంతో రూపొందించారు. ఈ యాప్‌లో 'స్పాట్‌ యువర్‌ ట్రైన్‌' సౌకర్యంతో రైలు గమనాన్ని బట్టి ఆ సమయంలో అదెక్కడుందో తెలుసుకోవచ్చు.. నిర్దేశిత స్టేషన్‌కు ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు బయలుదేరుతుందన్న సమాచారమూ తెలుస్తుంది. సంబంధిత రైలు పూర్తి షెడ్యూల్‌, ఆయా స్టేషన్ల మధ్య దూరం.. నిర్దేశిత స్టేషన్ల మధ్య ప్రయాణించే రైళ్లు, రద్దయిన ట్రైన్ల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ విండోస్‌ 8 ఓఎస్‌ ఫోన్లకే పనిచేసేలా రూపొందించినా, అన్ని ఓఎస్‌లపైనా పనిచేసేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు.

  ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థుల కోసం టాబ్లెట్‌

  * తీసుకురానున్న మైక్రోసాఫ్ట్‌
  * హెచ్‌పీ, పియర్సన్‌లతో భాగస్వామ్యం

  న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల కోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఒక టాబ్లెట్‌ను తీసుకురానుంది. ఇందు కోసం హెచ్‌పీ, పియర్సన్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు సంయుక్తంగా విండోస్‌ 8.1 ఆధారిత 10.1 అంగుళాల హెచ్‌పీ ఓమ్ని10 టాబ్లెట్‌ను విడుదల చేస్తాయి. ఇందులో పియర్సన్‌ అందించిన కంటెంట్‌తో పాటు; మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ కూడా ఉంటుంది. ధర రూ.29,999. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ప్రైవేటు స్కూలు విద్యార్థుల (కే6-12 స్థాయి) కోసం ఏసర్‌, ఎమ్‌బీడీ గ్రూపు, టాటా టెలీసర్వీసెస్‌లతో కలిసి ఏసర్‌ ఐకానికా డబ్ల్యూ4-820ను మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. దాని ధర రూ.24,999.
  ప్రత్యేకతలు:
  * 10 ఇ-పుస్తకాలు(ప్రీలోడెడ్‌)
  * డ్రీమ్‌స్పార్క్‌ స్టూడెంట్‌ సైట్‌ ద్వారా వివిధ మైక్రోసాఫ్ట్‌ డెవలపర్‌ టూల్స్‌, సర్వర్లు
  * 50 జీబీ మెయిల్‌ బాక్స్‌, 25 జీబీ ఒన్‌డ్రైవ్‌ప్రొ ఉచితం
  * ఇంటెల్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌ జెడ్‌ 3000 సిరీస్‌తో నడిచే ఈ టాబ్లెట్‌ బ్యాటరీ జీవితకాలం 8.5 గంటలు.
  * 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ(మరో 32 జీబీని అదనంగా పెంచుకునే వీలుంది).
  * 8 మెగాపిక్సెల్‌(వెనుక), 2 మెగాపిక్సల్‌(ముందు) కెమేరాలు

  పెద్ద తెర స్మార్ట్‌ఫోన్‌

  * కాన్వాస్‌ డూడుల్‌ 3ని ఆవిష్కరించిన మైక్రోమ్యాక్స్‌
  ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లపై బహుళజాతి సంస్థలు దృష్టి సారించడంతో, దేశీయ సంస్థలూ పోటీకి సై అంటున్నాయి. మెరుగైన ఫీచర్లతో పెద్ద స్మార్ట్‌ఫోన్‌ కాన్వాస్‌ డూడుల్‌ 3ని (రూ.8,500) మైక్రోమ్యాక్స్‌ విపణిలోకి విడుదల చేసింది. 6 అంగుళాల కెపాసిటివ్‌ తాకేతెర, 1.3 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, వెనుక-ముందు 5.0-0.3 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 32 జీబీ వరకు పెంచుకునే వీలున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.2 (జెల్లీబీన్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒకసారి చార్జి చేస్తే 9 గంటల పాటు మాట్లాడేందుకు లేదా 260 గంటలు స్టాండ్‌బైగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. .

  హెచ్‌టీసీ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌

  ఈనాడు, హైదరాబాద్‌: విక్రయాలు మరింత పెంచుకునేందుకు తక్కువ ధర స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరిస్తామని ప్రకటించిన హెచ్‌టీసీ, ఈ శ్రేణిలో డిజైర్‌ 210ను ప్రదర్శించింది. ఈ డ్యూయల్‌సిమ్‌ 3జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,700గా ప్రకటించింది. 4 అంగుళాల కెపాసిటివ్‌ తాకేతెర, 1 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌కోర్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, వెనుక-ముందు 5.0-0.3 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 1,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 32 జీబీ వరకు పెంచుకునే వీలున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.2 (జెల్లీబీన్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒక సిమ్‌ సాధారణంగా, మరొకటి మైక్రోసిమ్‌గా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ మే2 నుంచి విపణిలో లభిస్తుంది.
  మరో 2 ఖరీదైన ఫోన్లు: రూ.49,900 విలువైన హెచ్‌టీసీ వన్‌ ఎం8 స్మార్ట్‌ఫోన్‌ను మే7న విపణిలోకి విడుదల చేస్తామని సంస్థ తెలిపింది. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్‌ తాకేతెర కలిగిన ఈ ఫోన్‌ 209 జీబీ మెమొరీని సపోర్ట్‌ చేస్తుంది.
  * రూ.23,990 విలువైన హెచ్‌టీసీ డిజైర్‌ 816ను మే నెలలో విపణిలోకి విడుదల చేస్తామని తెలిపింది. 5.5 అంగుళాల తాకేతెర, 1.6 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, 1.5 జీబీ ర్యామ్‌, వెనుక-ముందు 13-5 మెగాపిక్సెల్‌ కెమెరాలు కలిగిన ఈ ఫోన్‌ జీఎస్‌ఎం, 3జీ, సీడీఎంఏ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుందని వెల్లడించింది. ఈ ఫోన్‌కు 2 నానోసిమ్‌ కార్డులు, ఒక మైక్రో సిమ్‌కార్డు ఏర్పాటు చేసుకునే వీలున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.4.2 కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

  గెలాక్సీ ఎస్‌5 వచ్చేసింది

  ఈనాడు - హైదరాబాద్‌ : శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తమ అధునాతన హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎస్‌5ను విపణిలోకి విడుదల చేసింది. 5.1 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ సూపర్‌ అమోల్డ్‌ తాకేతెర, 2.5 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ అప్లికేషన్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీతో పాటు ఎస్‌డీకార్డుతో 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం, 2,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వెనుక-ముందు 16-2 మెగాపిక్సెల్‌ హెచ్‌డీఆర్‌ కెమెరాలు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.4.2 కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 42 ఎంబీపీఎస్‌ వేగంతో 3జీ నెట్‌ బ్రౌజ్‌ చేసే అవకాశం ఉన్న ఈ ఫోన్‌ను దుమ్ము-నీరు ఏమీ చేయలేవని శామ్‌సంగ్‌ ప్రకటించింది. కెమెరాకు ఉన్న ఫాస్ట్‌ ఆటో ఫోకస్‌ ఫీచర్‌ వల్ల, వేగవంతమైన కదలికలను, హెచ్‌డీఆర్‌ పద్ధతిలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు మరింత స్పష్టంగా చిత్రీకరించవచ్చు. సెలెక్టివ్‌ ఫోకస్‌ పద్ధతిలో అవసరమైన వ్యక్తులను స్పష్టంగా, మిగిలినవి బూదర (బ్లర్‌)గా చేయవచ్చు.
  హృదయ స్పందన (హార్ట్‌రేట్‌) నమోదు: ఫోన్‌ వెనుక భాగాన చేతివేలును ఉంచడం ద్వారా హృదయ స్పందన నమోదు చేయవచ్చని, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని శామ్‌సంగ్‌ ప్రకటించింది. పెడోమీటర్‌ ద్వారా రోజువారీ వ్యాయామాలను నమోదు చేస్తుందని, వినియోగదారు లక్ష్యాన్ని చేరుతున్నారో లేదో తెలిసిపోతుందని ప్రకటించింది. డౌన్‌లోడ్‌ బూస్టర్‌తో ఎల్‌టీఈ, వైఫైని ఒకేసారి వినియోగించుకోవచ్చు. చేతివేలు స్కానింగ్‌ ద్వారా ఫోన్‌ను లాక్‌/అన్‌లాక్‌ చేయవచ్చు. ధర రూ.51,500.

  సెల్‌కాన్‌ క్యాంపస్‌ ఏ125

  ఈనాడు, హైదరాబాద్‌: క్యాంపస్‌ శ్రేణిలో సరికొత్త 3జీ డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఏ125ను విపణిలోకి విడుదల చేసినట్లు సెల్‌కాన్‌ మొబైల్స్‌ ప్రకటించింది. 4.5 అంగుళాల కెపాసిటివ్‌ తాకే తెర, 1.3 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌కోర్‌ ప్రాసెసర్‌, వెనుక-ముందు 5-1.3 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 4.2.2 జెల్లీబీన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ అంతర్గత మెమొరీ ఉండగా, ఎస్‌డీకార్డుతో 32 జీబీకి పెంచుకోవచ్చు. మాతృభాషలో మెసేజింగ్‌కు వీలుగా 9 భాషలను సపోర్ట్‌ చేస్తుంది. 3జీ వీడియో కాలింగ్‌కు అవకాశం ఉన్న ఈ ఫోన్‌లో 'షేక్‌ అండ్‌ షేర్‌', మల్టీప్లేయర్‌ గేమింగ్‌, డూడ్లింగ్‌ వంటి ఫీచర్లు నిక్షిప్తం చేశామని పేర్కొన్నారు. ఈ ఫోన్‌తో ఫ్లిప్‌కవర్‌ ఉచితంగా అందిస్తున్నారు. ధర రూ.6,399.

  30 సెకన్లలో ఛార్జింగ్‌

  వాషింగ్టన్‌: కేవలం 30 సెకన్లలో ఛార్జ్‌ అయ్యే సెల్‌ఫోన్‌ బ్యాటరీని ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. నానోడాట్స్‌ అనే సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని వారు సాధించారు. నానోడాట్స్‌ అనేవి రసాయనికంగా తయారైన బయోఆర్గానిక్‌ పెప్త్టెడ్‌ అణువులు. చాలా చిన్నసైజులో ఉండే ఈ అణువులు.. ఎలక్ట్రోడు సామర్థ్యాన్ని, ఎలక్ట్రోలైటు పనితీరును గణనీయంగా మెరుగుపరచగలవు. వీటిని ఉపయోగించి ఇజ్రాయిల్‌కు చెందిన స్టోర్‌డాట్‌ అనే సంస్థ కొత్తరకం ఎలక్ట్రోడులను తయారుచేసింది. ఇవి ఓవైపు అతితక్కువ వ్యవధిలో ఛార్జ్‌ అయ్యే సూపర్‌ కెపాసిటర్‌గా పని చేస్తాయని, మరోవైపు, ఛార్జింగ్‌ను చాలా నెమ్మదిగా కోల్పోయే లిథియం ఎలక్ట్రోడులాగానూ ఉంటాయని స్టోర్‌డాట్‌ సీఈఓ డోరోన్‌ మయర్స్‌డార్ప్‌ చెప్పారు. ప్రస్తుతం కొన్ని సంస్థలు నానోడాట్స్‌, క్వాంటండాట్స్‌ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నప్పటికీ.. వాటి తయారీలో భారలోహాలను వాడుతున్నందువల్ల అవి హానికరంగా రూపొందుతున్నాయని తెలిపారు. తాము మాత్రం పర్యావరణ అనుకూల పదార్థాలనే ఉపయోగిస్తున్నామన్నారు. ఈ సాంకేతికతను ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో కూడా వినియోగించుకోవచ్చని డోరోన్‌ సూచించారు.

  జియోనీ పలుచని స్మార్ట్‌ఫోన్‌

  ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలోనే అత్యంత పలుచని స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించినట్లు జియోనీ ప్రకటించింది. 5.55 మిల్లీమీటర్ల మందం కలిగిన ఇలైఫ్‌ ఎస్‌5.5 ను సోమవారం గోవాలో జరిగిన కార్యక్రమంలో జియోనీ దేశీయ అధిపతి అరవింద్‌ ఆవిష్కరించారు. 5 అంగుళాల సూపర్‌ అమోల్డ్‌ తాకేతెర, 1.7 గిగాహెర్ట్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, వెనుక 13- ముందు 5 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 16 జీబీ+2జీబీ మెమొరీ, కలిగిన ఈ 3జీ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత అమిగో 2.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫోన్‌లో కలిపే ఉంటుంది. మెటాలిక్‌ ఫ్రేమ్‌ కలిగి తెలుపు, నలుపు, నీలి, గులాబీ, లేత ఎరుపు (పర్పుల్‌) రంగుల్లో లభించే ఈ ఫోన్‌కు వెనుకవైపు కూడా గ్లాస్‌ అమర్చారు. ఏప్రిల్‌ 27న రాష్ట్ర విపణికి అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్‌ ధర రూ.22,999.

  సెల్‌ఫోన్‌ను ప్రొజెక్టరుగా మార్చే చిప్‌

  వాషింగ్టన్‌: సెల్‌ఫోన్‌ను ప్రొజెక్టర్‌గా మార్చగలిగే సిలికాన్‌ చిప్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. కాలిఫోర్నియా సాంకేతిక సంస్థ(కాల్‌టెక్‌) పరిశోధకులు రూపొందించిన ఈ కాంతి వక్రీకరణ చిప్‌ సెల్‌ఫోన్లను కటక రహిత ప్రొజెక్టర్లుగా పనిచేయించగలుగుతుంది. ఈ చిప్‌ సహాయంతో ప్రత్యేక యంత్ర భాగాలేమీ లేకుండా కాంతి వనరుగా ఒకే లేజర్‌ డయోడ్‌ను ఉపయోగించుకుని చిత్రాన్ని ప్రదర్శించొచ్చు. కాల్‌టెక్‌కు చెందిన అలీ హాజీమిరి నేతృత్వంలోని పరిశోధకులు సంప్రదాయ దృశ్యశాస్త్ర పద్ధతుల్లో కాకుండా కాంతి అమరికను మార్చి ఈ చిప్‌ తలం మీదుగా కాంతి తరంగాలను వక్రీకరించగలిగారు. ప్రస్తుతం పరారుణ కాంతి(ఇన్‌ఫ్రారెడ్‌)తో కంప్యూటర్‌లోని చిత్రాలను ప్రదర్శించగలుగుతున్నారు.. దీన్ని మరింత మెరుగుపరిస్తే సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రాలను ప్రదర్శించొచ్చని చెబుతున్నారు.

  గ్రహాంతర జీవం అన్వేషణకు కొత్తపద్ధతి

  వాషింగ్టన్: గ్రహాంతరజీవం అన్వేషణకు మరో కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది గ్రహం వాతావరణ పీడనాన్ని లెక్కించటం ద్వారా అక్కడ జీవం ఉనికికి ఎంతమాత్రం అవకాశం ఉందన్నది తేలుస్తుంది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అభివృద్ధిపరిచారు. భారతదేశ మూలాలున్న అమిత్‌మిశ్రా అనే యువశాస్త్రవేత్త ఈ పరిశోధనకు నేతృత్వం వహించటం విశేషం. మిశ్రా బృందం అభివృద్ధి చేసిన పద్ధతి.. డైమర్ అనే అణువుల ద్వారా వాతావరణ పీడనాన్ని విశ్లేషిస్తుంది. దీనిద్వారా.. ఫలితంగా గ్రహం ఉపరితలం ఎలా ఉంది? అక్కడ ద్రవస్థితిలో నీరు ఉండటానికి అవకాశం ఉందా? వంటి వివరాలు తెలుస్తాయి. డైమర్ అణువులు అనేక రకాలుగా ఉంటాయి. మిశ్రా బృందం ఆక్సిజన్‌పై దృష్టి సారించి ప్రయోగాలు జరిపింది. డైమర్ ఆక్సిజన్ అణువులు వేరే గ్రహం మీద ఉంటే.. అక్కడి వాతావరణ పీడనం భూమి వాతావరణ పీడనంలో కనీసం నాలుగోవంతు నుంచి మూడోవంతు వరకూ ఉండే అవకాశం ఉందని అమిత్‌మిశ్రా తెలిపారు. ఈ నూతన పద్ధతిని ఉపయోగించి గ్రహాంతరజీవం గురించి మరింత సమర్థవంతంగా అన్వేషించవచ్చని పేర్కొన్నారు.

  గూట్లో ఏముందో గూగుల్లో చూడండి!

  న్యూఢిల్లీ: ఏ షాపింగ్ మాల్లో.. ఎక్కడ ఏముంది..! ఏ మ్యూజియంలో ఏం ప్రత్యేకత.. క్షణాల్లో తెలుసుకోవచ్చంటోది గూగుల్. ఈ సంస్థ భారత్‌లో ఇండోర్ మ్యాప్ సేవలను ప్రారరంభించింది. ఈ సేవలతో ప్రముఖ నిర్మాణాలు, మాల్స్, మ్యూజియాల లోపల ఏక్కడ ఏముందో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవలు ప్రస్తుతం అమెరికా, జపాన్, సింగపూర్, హాంకాంగ్, నెదర్లాండ్స్‌లో ఉన్నాయి. ఈ సేవల వల్ల పర్యటకులు ఎక్కడ ఏముంటాయో ముందే చూసి తెలుసుకొని తర్వాత పర్యటనను మొదలుపెట్టవచ్చని గూగుల్ ఇండియా మ్యాప్స్ డైరెక్టర్, ప్రోడక్ట్ మేనేజర్.. సురేన్ రుహేలా తెలిపారుహ్రైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియమ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ తదితరాలకు సంబంధించిన ఇండోర్ మ్యాప్స్ కూడా త్వరలో అందుబాటులోకివస్తాయని తెలిపారు.

  చల్లని ఐస్‌క్రీంలో కమ్మని సంగీతం!!

  వాషింగ్టన్: మనసు పడిన ఐస్‌క్రీమ్‌ను నాలుకతో తాకగానే మదిదోచే సంగీతం వినపడితే ఎలా ఉంటుంది! అసలా భావనే అద్భుతంగా ఉంటుందికదా! అయితే, ఆ భావనలను నిజం చేశారు న్యూయార్క్‌కు చెందిన ఔత్సాహికులు. వీరు తయారు చేసిన ఐస్‌క్రీం కోన్‌లలో కమ్మని సంగీతాన్ని వినిపించే ఏర్పాటు చేశారు. ఈ కోన్‌లలో నింపిన ఐస్‌క్రీంను రుచిచూడటానికి నాలుకతో తాకగానే అందులోని సెన్సర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. వెంటనే వీనులవిందైన సంగీతం వినపడుతుంది. కోన్‌లలో 'కెపాసిటివ్ సెన్సర్'లను అమర్చడమే ఈ చల్లని సంగీతానికి కారణం అని ఆవిష్కర్తలు వివరించారు. ఐస్‌క్రీంను తినడానికి సిద్ధమవడమే ఆలస్యం...సెన్సర్లు స్పందిస్తాయి. ఎలక్ట్రానిక్ సంకేతాలను ఐస్‌క్రీంకోన్‌కు అడుగుభాగాన స్టాండులా ఏర్పాటు చేసిన అమరికలోని 'ఆర్డునియో బోర్డు'కు పంపుతాయి. దీంతో.. మంద్రస్థాయిలో సుమధుర సంగీతం వినపడుతుంది. రకరకాల వాయిద్యాల సుమధుర నాదాలను నిక్షిప్తం చేసిన కంప్యూటర్ వ్యవస్థ ఇందుకు సాయపడుతుందని తయారీదారులు తెలిపారు. మొత్తం మీద కెపాసిటివ్ సెన్సర్లు, కోన్‌స్టాండ్ మాదిరిగా ఏర్పాటైన అమరిక... కంప్యూటర్‌తో అనుసంధానం...ఇవన్నీ కలగలిసి ఐస్‌క్రీం తినడానికి సంగీతాన్ని జోడిస్తున్నాయని పేర్కొన్నారు.

  పాదరక్షలనూ స్కాన్ చేద్దాం

  న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు బూట్లలో బంగారం దాచి.. అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనలు ఇటీవల పలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల్లో బూట్ల (షూ) స్కానర్లను ఏర్పాటు చేయాలని కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) భావిస్తోంది. దేశంలో 51 పౌర విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ భద్రత విధులు నిర్వహిస్తోంది. అమెరికాలో వినియోగంలో ఉన్న 'షూ స్కానర్'ల తరహా యంత్రాలను ఇక్కడ వినియోగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కీలకమైన ఢిల్లీ, ముంబయి వంటి విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసే విషయమై పౌర విమానయాన భద్రత సంస్థ (బీసీఏఎస్)తో చర్చించనున్నారు. ఇటీవల చోటుచేసుకున్న బంగారం అక్రమ రవాణా ఘటనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఐఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ (విమానాశ్రయాల భద్రత) ఓపీ సింగ్ తెలిపారు.

  స్మార్ట్‌ఫోన్లకు చక్కెరతో ఛార్జింగ్

  వాషింగ్టన్: స్మార్ట్‌ఫోన్లకు పదిరోజులకు సరిపడ ఛార్జింగ్‌ను అందించే చక్కెరతో పనిచేసే కొత్తరకం బ్యాటరీలను రూపొందించారు. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ బ్యాటరీలను తయారు చేశారు. ఇవి ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్న లిథియం బ్యాటరీల కంటే తక్కువ బరువుతో, మెరుగ్గా పనిచేస్తాయని ఈ పరిశోధనలో పాల్గొన్న జీగ్యాంగ్ జ్యూ చెప్పారు. మనదేహంలో జరిగే జీవక్రియలో చక్కెర శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ చక్కెర కార్బన్‌డైయాక్సైడ్, నీటి అణువుగా విడిపోయినపుడు ఎలక్రాన్లుగా విడుదలవుతాయి. అలాగే ఈ జీవబ్యాటరీలు శక్తిని కూడా విడుదల చేస్తాయి. ఈ శక్తి ద్వారా స్మార్ట్‌ఫోన్లను దాదాపు పదిరోజుల వరకు వాడుకోవచ్చని, ఇవి పునర్వినియోగ, విషరహితమని జ్యూ పేర్కొన్నారు. ఈ మేరకు 'ఇన్‌సైడ్ సైన్స్ న్యూస్ సర్వీస్(ఐఎస్ఎన్ఎస్) తన కథనంలో పేర్కొంది.

  ఇది ఓ మంచి యాప్!

  న్యూఢిల్లీ: కారు, బైక్, బస్ మరే వాహనం లేదా ఎక్కడి నుంచైనా హార్న్/అలారం మోగితే చాలు.. వెంటనే ఫోన్‌లో మ్యూజిక్‌ను ఆపేసే యాప్‌ను రూపొందించింది అమెరికాకు చెందిన ఒన్ లియామా సంస్థ. ఈ హెడ్‌ఫోన్ యాప్‌ను మొబైల్లో నిక్షిప్తం చేసుకొంటే.. మ్యూజిక్ వింటున్నపుడు హార్న్/అలారం మోగితే మ్యూజిక్ ఆగిపోయి.. ఆ శబ్దాలు వినిపిస్తాయి. దీని వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం తగ్గుతుంది. ఇది ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది. ఈ మేరకు ఈ యాప్ వివరాలను గిజ్‌మాగ్ వెల్లడించింది. అయితే ఈ యాప్ ఇంకా విడుదల కాలేదు.

  సైగలతో పరికరాల నియంత్రణ

  వాషింగ్టన్: చేతి సైగలతోనే గృహోపకరణాలను నియంత్రించడం ఇక సాకారం కాబోతోంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఉంగరం ఆకృతిలో ఉన్న ఒక సాధనాన్ని అభివృద్ధి చేశారు. టెక్స్ట్ సందేశాన్ని పంపడం, పరికరాలను ఆన్ చేయడం, చెల్లింపులు చేయడం వంటివి దీని ద్వారా వీలవుతాయి. శాస్త్రవేత్తలు రూపొందించిన సాధనం ఉంగరంలానే ఉంటుంది. అందులో సెన్సర్లు, ఎలక్ట్రానిక్ భాగాలు ఉంటాయి. గాల్లో అక్షరాలను గీయడం ద్వారా టెక్స్ట్ రూపొందించవచ్చు. చెల్లింపులను ఖరారు చేయడానికి సైగల ద్వారా అనుమతి ఇవ్వవచ్చు. ఉంగరంలో ఉన్న ప్రకంపన మోటారు, ఎల్ఈడీ ద్వారా.. అనుసంధాన పరికరాల నుంచి అప్రమత్తత సందేశాలను పంపవచ్చు. ఉంగరంలోని సెన్సర్లు చిన్నపాటి వేలి కదలికలను కూడా గుర్తించగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. టెక్స్ట్, నెంబర్లను ఎంటర్ చేయడానికి ముందే సెట్ చేసిన అక్షరాలు కూడా ఉంటాయి. దాన్ని ఇతర బ్లూటూత్ పరికరాలతో నేరుగా అనుసంధానించవచ్చు.

  ఫోన్..ట్యాబ్..కిండిల్..ల్యాపీ అన్నీ ఒకటే

  వాషింగ్టన్: మీ అవసరాలకు తగినట్లు ఫోన్‌ను.. ట్యాబ్లెట్, చిన్నపాటి ల్యాప్‌టాప్, చేతి బ్రాండ్‌లా మార్చుకొనే వీలుకలుగనుంది. ఎలాగైనా మార్చుకోగలిగే ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని బెల్జియంలోని హస్సెల్ట్ యూనివర్సిటీ ఐ మైండ్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఒక పరికరాన్ని భౌతికంగా పలు రకాలుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రొటోటైప్‌ను కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. రూబిక్ పజిల్‌ను ఆదర్శంగా తీసుకొని దీన్ని తయారు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ ఫోన్‌కి పెడల్ అని పేరుపెట్టారు. దీన్ని ఇష్టం వచ్చినట్లు మడతపెట్టవచ్చు.

  వెబ్ శోధన ఇక తేలిక

  * కొత్త సాఫ్ట్‌వేర్ సిద్ధం
  బెర్లిన్: ఇంటర్నెట్‌లో శోధనను తేలిక చేసే ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనం టైప్ చేసిన టెక్స్ట్‌లోని పేర్లలో సందిగ్ధతను తనంతట తానే తొలగిస్తుంది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మాటిక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు.
  ''ఉదాహరణకు మెర్కెల్ అనే చివరి పేరును చదివేటప్పుడు అది జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్‌కు సంబంధించిందా లేక సాకర్ కోచ్ మాక్స్ మెర్కెల్‌కు సంబంధించిందా అన్నదానిపై ప్రజల్లోనూ అయోమయం తలెత్తుతుంది. వెబ్ శోధనలోనూ ఈ ఇబ్బంది ఉంటుంది'' అని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతమున్న ప్రోగ్రామ్‌లు 'ఏంజెలా మెర్కెల్' అనే క్యారక్టర్ స్ట్రింగ్స్‌ను మాత్రమే గ్రహించగలుగుతున్నాయి. జర్మన్ ఛాన్సలర్ లేదా జర్మనీ ప్రథమ మహిళ వంటి లక్షణాలపై దృష్టి సారించడంలేదు. పైగా.. మెర్కెల్ అనే పదాన్ని టైప్ చేసిన తర్వాత కూడా ఆ సెర్చ్ ఇంజిన్ అదే పేరు కలిగిన బోలెడు మంది సమాచారాన్ని ఇస్తోంది. తాజాగా జర్మన్ శాస్త్రవేత్తలు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో పేర్లకు సంబంధించి ఈ అస్పష్టతను తగ్గిస్తుంది. వికిపీడీయా సాయంతో విశ్లేషించడం ద్వారా వైరుద్ధ్యాలను స్పష్టంగా గుర్తిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ పేరు ఏఐడీఏ. మనం టైప్ చేసిన టెక్స్ట్‌లోని అంశాలతో దగ్గరగా సరిపోలే వ్యక్తులు, ప్రదేశాలతో సంబంధాలను ఏర్పరిచి, మన అన్వేషణను తేలిక చేస్తుంది.

  దూరం నుంచే పేలుడు పదార్థాల గుర్తింపు

  * సరికొత్త పరిజ్ఞానం అభివృద్ధి

  * విమానాశ్రయాల్లో ఫుల్‌బాడీ స్కానర్లకు ఇక సెలవు!
  జెరుసలేం: ప్రయాణికులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే ఫుల్‌బాడీ స్కానర్లు అవసరం తప్పిపోనుంది. తేలిగ్గా, శరీరాన్ని తడిమే పనిలేకుండా పేలుడు పదార్థాలను గుర్తించే కొత్త పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో టెరాహెర్జ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీనిసాయంతో చాలా దూరం నుంచే పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు. ఈ పరిజ్ఞానం వల్ల.. విమానాశ్రయంలో చాలా ఎక్కువ ప్రాంతాన్ని సర్వే చేసే డిటెక్టర్ల అభివృద్ధికి వీలు కలుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఆర్‌డీఎక్స్, టీఏటీపీ అనే రెండు రకాల పేలుడు పదార్థాలను విజయవంతంగా గుర్తించింది.
  టెరాహెర్జ్ స్పెక్ట్రోస్కొపీలో విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తారు. దీన్ని విస్ఫోట పదార్థాల గాలింపుతోపాటు ఔషధ కంపెనీల్లో నాణ్యత తనిఖీ కోసం ఉపయోగించవచ్చు. పురాతన చిత్రాల్లో పొరలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తుంది. మరింత మెరుగైన రిమోట్ సెన్సర్ల తయారీకి కూడా మార్గం సుగమం చేస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన ఆర్ కోస్లోఫ్ పేర్కొన్నారు.

  బొమ్మను చేసీ..! ప్రాణం పోసీ..!

  * శ్రస్త్రచికిత్సకు 3డీ గుండె సాయం
  వాషింగ్టన్: ఈ చిత్రంలో ఉన్నది అమెరికాలోని 14 నెలల బాలుడి గుండెకు నకలు. దీన్ని త్రీడీ ముద్రణ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. పుట్టుకతో ఈ చిన్నారికి గుండెలో 4సమస్యలు తలెత్తాయి. వాటిని అధ్యయనం చేయడానికి లూయీస్ విల్లే విశ్వవిద్యాలయ పరిశోధకులు, కొసైర్ చిన్నారుల ఆసుపత్రి వైద్యులు ఆ చిన్నారి గుండెకు నకలు తీయాలని భావించారు. ఇందుకోసం ఆ చిన్నారి గుండెకన్నా 1.5 రెట్లు మేర త్రీడీలో ఓ ఫిలమెంట్‌తో ఈ గుండెను ముద్రించి.. అందులో లోపాలపై అధ్యయనం చేశారు. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని.. దాని ప్రకారం.. ఒకే ఒక్క శస్త్రచికిత్స చేసి సమస్యను తీర్చారు. ఒన్స్‌బరోకి చెందిన ఆచిన్నారి ఆరోగ్యంగా ఉంది. ఈ త్రీడీ నకలుకు 600 డాలర్లు ఖర్చుకాగా 20 గంటలు పట్టింది. త్రీడితో గుండెకు నకలు తీసి సమస్యలను అధ్యయనం చేయడమన్నది గొప్ప ప్రయోజనాలు ఇస్తుందని వైద్యులు తెలిపారు.

  అడవిని గాచిన వెబ్‌సైట్

  వాషింగ్టన్: ఇప్పుడు తిరుపతిలో అడవుల పరిస్థితి ఏంటి.. అక్కడ వృక్షసంపద తరిగిందా.. లేక పెరిగిందా..! వంటి వివరాలను ఒక్క మౌస్ క్లిక్‌తో తెలుసుకోవచ్చంటోది గూగుల్. ఈ అంతర్జాల దిగ్గజం ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరికివేతకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు వీలుగా గ్లోబల్‌ఫారెస్ట్‌వాచ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందట ఎక్కడ వృక్షసంపద ఎలా ఉన్నదో అధ్యయనం చేసి ఆ వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వీటికితోడు గూగుల్ ఎర్త్, గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల సాయంతో వృక్షసంపద వివరాలను వీలైనంత పక్కాగా అందిస్తారు.

  కరెంటు వృధా ఇలా 'కట్'!!

  వాషింగ్టన్: విద్యుత్ వినియోగాన్ని ఏడాదిలో సుమారు 50 శాతం తగ్గించగలిగే ఒక ఫార్ములాను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఏదైనా సరే ఒక భవంతిలో వినియోగించే విద్యుత్ ఎక్కడ వృధా అవుతోందనే విషయాన్ని కనిపెట్టే విధానాన్ని ఓక్లహామా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆయా భవంతుల పరిస్థితి...వాటి నిర్వహణ తీరును బట్టి అక్కడ ఏ మేరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చనే విషయాన్ని అంచనావేశారు. ఇందుకోసం ఒక మానిటర్‌ను తయారు చేశారు. ఏదైనా పదార్థాన్ని వేడిచేయడానికి....ఎయిర్‌కండిషన్డ్ విభాగాలకు...కాంతినివ్వడానికి...ఇలా రకరకాల విధుల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్‌శక్తి పరిమాణాన్ని ఈ మానిటర్ ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంది. ఇందులోని సెన్సర్‌లు భవంతి మొత్తం మీద ఎక్కడ...ఏ పరికరం వల్ల విద్యుత్ వృధా అవుతోందో గుర్తించి హెచ్చరిస్తాయి. తద్వారా అవసరానికి మించి విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్న వాటిని గుర్తించి..తగిన చర్యలు చేపట్టి విద్యుత్‌ను ఆదా చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

  ఆంగ్ల పై పట్టు సాధించేందుకు ఆన్‌లైన్‌ గట్లు !

  1. ఆంగ్ల పదానికి అర్థంతో వ్యాకరణంలో సందేహాలు, పర్యాయ పదాల‌న్ని తెలుసుకోవ‌డానికి సైట్‌ ఉంది. ఈ సైట్ చూడ్డానికి సెర్చింజన్‌లా కనిపిస్తుంది. కానీ, మీకు కావాల్సిన అంశాన్ని పూర్తిస్థాయిలో ప్రాసెస్‌ చేసి ఫలితాల్ని అందిస్తుంది. అంతే కాకుండా గణిత సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. ఇతర పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నల్ని సెర్చ్‌బాక్స్‌లో పోస్ట్‌ చేసి ఫలితాన్ని రాబట్టొచ్చు. ఉదాహరణకు సెర్చింజన్‌ హోం పేజీలోని Examples చూడొచ్చు.
  Click here: http://www.wolframalpha.com/

  2. ఆంగ్ల వ్యాకరణాన్ని నేర్చుకొనే వారికి రోజువారీ అభ్యాసాలతో నేర్పడానికి. ఆన్‌లైన్‌ ట్యూటర్‌ ఉంది. సుమారు 440 అభ్యాసాలున్నాయి. 88 క్విజ్‌లను నింపుతూ మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు. పాఠ్యాంశాల్ని (Nouns, Pronouns, Verbs, Adjectives...) విభాగాల వారీగా పొందుపరిచారు.
  Click here: http://www.dailygrammar.com

  దానిమ్మ ప్రేరణగా చిన్నబ్యాటరీలు !

  వాషింగ్టన్‌: దానిమ్మను ప్రేరణగా తీసుకొని ఒక ఎలక్ట్రోడ్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ద్వారా కొత్తతరం చిన్న, తేలికపాటి, రీఛార్జిబుల్‌ బ్యాటరీల్లో సిలికాన్‌ వినియోగానికి వీలు కలుగుతుంది. ఈ ఎలక్ట్రోడ్‌లో సిలికాన్‌ నానో పదార్థాలు ఉంటాయి. వీటిని దానిమ్మ విత్తనాల తరహాలో కర్బన కవచంలో భద్రపరుస్తారు. ''తేలికపాటి బ్యాటరీల్లో సిలికాన్‌ ఆనోడ్ల వినియోగం దిశగా ఇది మనల్ని తీసుకెళ్లనుంది. సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, విద్యుత్‌ కార్ల కోసం శక్తిమంతమైన బ్యాటరీలకు ఇది అక్కరకొస్తుంది'' అని పరిశోధనకు నాయకత్వం వహించిన ఈ క్యూ చెప్పారు. వెయ్యి సైకిళ్ల ఛార్జింగ్‌, డిశ్చార్జింగ్‌ తర్వాత కూడా ఈ కొత్త ఆనోడ్‌.. 97 శాతం సామర్థ్యం వద్ద పనిచేయడం గమనార్హం.

  పెన్‌డ్రైవ్‌లో యాంటీ వైరస్‌ !

  పీసీలో కచ్చితంగా యాంటీవైరస్‌ని వాడతాం. కొన్నిసార్లు వైరస్‌లు సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసిన యాంటీ వైరస్‌ని డిసేబుల్‌ చేస్తుంటాయి. ఎంత స్కాన్‌ చేసినా వాటిని యాంటీవైరస్‌ పట్టుకోలేదు. ఇలా మాటేసుకుని ఉన్న మాల్వేర్‌లను మట్టుపెట్టేందుకు పెన్‌డ్రైవ్‌లో ప్రత్యేక యాంటీ వైరస్‌ని వాడొచ్చు. అలాంటిదే ClamWin. ఉచితంగా కిట్‌లో నిక్షిప్తం చేసుకుని మొదటి అస్త్రంగా వాడొచ్చు. రన్‌ చేయగానే సిస్టంలోని స్పైవేర్‌లు, వైరస్‌లను స్కాన్‌ చేసి తొలగిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వెర్షన్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పెన్‌డ్రైవ్‌లోకి ఆప్‌డేట్‌ చేయవచ్చు. మెయిల్‌ చెకింగ్‌కి 'అవుట్‌లుక్‌'ని వాడుతున్నట్లయితే ప్రత్యేక యాడ్‌ఆన్‌తో వైరస్‌ ఎటాచ్‌మెంట్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు.

  Click here for more details: http://goo.gl/wL0RYl

  అన్ని సబ్జెక్ట్‌లు ట్యాబ్లెట్‌లోనే !

  ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వినోదం కోసం ట్యాబ్లెట్‌ కొనేవారు తక్కువే. కొన్నప్పటికీ వాటిని చదువు నిమిత్తం వాడుకునేలా సలహాలు ఇస్తుంటారు. అదే చదువుకు ఉపయోగపడే ప్రత్యేక ట్యాబ్లెట్‌లు ఉంటే? అలాంటివే ఐబాల్‌ కంపెనీ తయారు చేసిన ట్యాబ్లెట్‌ పీసీలు. పేరు Edu-Slideసిరీస్‌. దేశీయ తయారీగా తొలిసారి అందుబాటులోకి వచ్చిన ఎడ్యుకేషనల్‌ ట్యాబ్లెట్‌ ఇదేనట. ఇక దీంట్లోని ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ విషయానికొస్తే.... సీబీఎస్‌, స్టేట్‌బోర్డ్‌, ఐసీఎస్‌ఈ సిలబస్‌లతో కూడిన పాఠ్యాంశాల్ని ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ అన్ని సబ్జెక్ట్‌లను ట్యాబ్లెట్‌తో చదువుకోవచ్చు. 10.1 అంగుళాల తాకేతెరతో Edu-Slide i1017 మోడల్‌ ఉంది. హెచ్‌డీ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 1280X800పిక్సల్స్‌. డ్యుయల్‌ కోర్‌ 1.5GHz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. డ్యుయల్‌ కెమెరాలు (వెనక 2 మెగాపిక్సల్‌, ముందు వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమెరా) ఉన్నాయి. ఇంటర్నల్‌ మెమొరీ 8 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 8000mAh. ట్యాబ్‌తో పాటు విండోస్‌ పీసీల్లో వాడుకునేలా ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌తో కూడిన డీవీడీని కూడా అందిస్తున్నారు. ఇంతకీ ధర సంగతేంటి అనేగా? రూ. 13,999. ఐఐటీ-జేఈఈ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారికి ప్రత్యేక మెటీరియల్‌తో ట్యాబ్‌ని అందిస్తున్నారు.
  Click here for more details: http://goo.gl/QA2yXF

  * హై కాన్ఫిగరేషన్‌తో కావాలలనుకుంటే Edu-Slide3G Q1035 మోడల్‌ ఉంది. Cortex A7 1.2GHzక్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. 3జీ నెట్‌వర్క్‌తో వీడియో కాలింగ్‌ చేయవచ్చు. ఆటోఫోకస్‌, ఫ్లాష్‌లైట్‌తో 8 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది.
  Click here for more details: http://goo.gl/KmeiOJ

  మీ ఫొటోతోనే ఫేస్‌బుక్‌ కవర్‌ని క్రియేట్‌ చేయండి !

  ఫేస్‌బుక్‌ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్రొఫైల్‌ పిక్‌లు మార్చడం. లైక్‌లు.. కామెంట్‌లు కొట్టడం... ఇలా సందడే సందడి. మరి, 'ఫేస్‌బుక్‌ కవర్స్‌' సంగతేంటి? కవర్‌ ఇమేజ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు ప్రత్యేక సర్వీసు ఉంది. కావాలంటే www.exolook.com వెబ్‌ అడ్డాలోకి వెళ్లండి. దీంట్లో డిజైన్‌ చేసిన 'ఫేస్‌బుక్‌ కవర్స్‌' సిద్ధంగా ఉన్నాయి. కావాల్సిన వాటిని సెలెక్ట్‌ చేసి ఫేస్‌బుక్‌ ఫ్రొఫైల్‌కి జత చేయవచ్చు. వివిధ రకాల కొటేషన్లతో కూడిన ఇమేజ్‌లను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. నచ్చిన వాటిపై క్లిక్‌ చేసి కవర్‌ని మార్చేయవచ్చు. మీ ఫొటోతోనే కవర్‌ని క్రియేట్‌ చేసుకునేందుకు Create Coverమెనూని సెలెక్ట్‌ చేయండి. ఒకే ఫొటోతోనే కాకుండా మొత్తం ఆల్బమ్‌ని కవర్‌లో సెట్‌ చేసుకునేలా Create Collage Cover ఆప్షన్‌ ఉంది. 'క్రియేట్‌'పైన క్లిక్‌ చేసి సిస్టంలోని ఫొటోలను సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసి కవర్స్‌ని రూపొందించొచ్చు. మొత్తం 24 ఫొటోలతో Collage కవర్‌ని తయారు చేయవచ్చు. మీ అభిమాన ఆటగాళ్లు, సినిమా సెలబ్రిటీల ఫొటోలను ఎఫ్‌బీ కవర్‌గా పెట్టుకునేందుకు Sports, Movies విభాగాలు ఉన్నాయి.
  Click here: www.exolook.com

  పెట్టిన చోటే చార్జింగ్ !

  జేబులోనూ... చేతిలోనూ... బ్యాగ్‌లోనూ... ఏదో ఒక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ కచ్చితంగా ఉంటుంది. ఇంటికి చేరగానే అన్నింటినీ ఓ చోట పెట్టేస్తాం. మీకు తెలుసా? ఆ పెట్టిన చోటే అన్ని గ్యాడ్జెట్‌లను ఛార్జ్‌ చెయ్యొచ్చు. అందుకు తగిన పరికరాన్ని ఇంటెల్‌ కంపెనీ తయారు చేసింది అదే Intel Smart Bowl. గిన్నె మాదిరిగా కనిపించే దీంట్లో వాడుతున్న మొబైల్‌, ఐపాడ్‌, ఐప్యాడ్‌, కీచైన్‌, బ్యాటరీలు... ఛార్జింగ్‌తో పని చేసే వాటిని ఉంచితే చాలు. ఛార్జ్‌ అవుతాయి. భవిష్యత్‌ అవసరాలకు అనువుగా ఈ నమూనా పరికరాన్ని రూపొందించారు. ప్రస్తుతానికి ఇంటెల్‌ తయారు చేసిన 'స్మార్ట్‌ హెడ్‌సెట్‌' మాత్రమే ఛార్జ్‌ అవుతుంది. ముందు ముందు ప్రత్యేక 'వైర్‌లెస్‌ పవర్‌' ద్వారా అన్నింటినీ ఛార్జ్‌ చేస్తుందట. బౌల్‌ వ్యాసార్థం 10 అంగుళాలు.

   

  ఒక్కటే వేదిక !

  సిస్టం వెంటే ఉండక్కర్లేదు. కావాల్సిన ఆప్స్‌ని ఎక్కడి నుంచైనా వాడుకునేలా క్లౌడ్‌ సర్వీసులు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యమైన ఫైల్స్‌ని భద్రం చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లోనే ఎడిట్‌ చేయవచ్చు. ఇలాంటి అరుదైన వెబ్‌ ఆప్స్‌ని ఒకేచోటి నుంచి యాక్సెస్‌ చేయడానికి https://zapier.com వెబ్‌ సైట్‌ అనువైంది. ఉచితంగా సభ్యులై వెబ్‌ ఆప్స్‌ని సింక్రనైజ్‌ చేసుకునే వీలుంది. ఉదాహరణకు వాడుతున్న జీమెయిల్‌లోని ముఖ్యమైన మెయిల్స్‌ని 'ఎవర్‌నోట్‌' క్లౌడ్‌ ఆప్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ క్యాలెండర్‌లో ఈవెంట్స్‌ని ప్లాన్‌ చేసుకోవచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌లను యాక్సెస్‌ చేయవచ్చు.

  Click here for Web site: https://zapier.com

  సాఫ్ట్‌వేర్‌ అక్కర్లేదు !

  కొన్నిసార్లు ఫైల్‌ ఫార్మెట్‌ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సిస్టంలో సాఫ్ట్‌వేర్‌లనే ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. ఉచితంగా ఆన్‌లైన్‌లోనే చేయడానికి cloudconvert ఉప‌యోగించండి. సుమారు 178 ఫార్మెట్‌లను ఈ సైట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆడియో, వీడియో, డాక్యుమెంట్‌, ఫొటోలు, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రజంటేషన్స్‌, ఈ-బుక్స్‌... ఏదైనా దీంట్లోకి అప్‌లోడ్‌ చేసి కన్వర్ట్‌ చేయవచ్చు. డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని మెయిల్‌కి వచ్చేలా చేయవచ్చు. అందుకు Mail me when it is finishedఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. ఒకవేళ మీరు క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్ని వాడుతున్నట్లయితే 'డ్రాప్‌బాక్స్‌', 'గూగుల్‌ డ్రైవ్‌'లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... కన్వర్ట్‌ చేసిన ఫైల్స్‌ని సరాసరి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి చేరేలా చేయవచ్చు. అందుకు Send it into my Dropbox, Google Drive ఆప్షన్ని చెక్‌ చేయాలి. కన్వర్షన్‌ పూర్తయ్యాక కావాలంటే ఫైల్‌ని 'డౌన్‌లోడ్‌' చేసుకునే వీలుంది. ఆప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ ఏమవుతాయి? అనేదేగా సందేహం. సింపుల్‌... కన్వర్షన్‌ పూర్తవ్వగానే వెబ్‌ సైట్‌ నుంచి ఫైల్స్‌ డిలీట్‌ అవుతాయి. సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మెట్‌లను బ్రౌజ్‌ చేసి చూడాలనుకుంటే హోం పేజీలోని Conversion Types ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. దీంట్లోని మరో ప్రయోజనం ఏంటంటే... అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ని ఒకటే ఫైల్‌గా మెర్జ్‌ చేయవచ్చు కూడా.

  Click here for Web site: https://cloudconvert.org/

  అరచేతినే 'తెర'చేయి !
  వాషింగ్టన్‌: అరచేతినే తాకేతెర(టచ్‌స్క్రీన్‌)గా మార్చేసే చిన్న పరికరం అందుబాటులోకి వచ్చింది.. 'ఫిన్‌' అనే ఈ పరికరాన్ని ఓ భారతీయుడు స్థాపించిన కొత్త ఐటీ సంస్థ దీన్ని రూపొందించడం విశేషం. దీని సహాయంతో స్మార్ట్‌ఫోన్లు, కార్‌ రేడియోలు, స్మార్ట్‌ టీవీలు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాటిని తాకకుండానే ఉపయోగించొచ్చు. ఉంగరంలా ఉండే ఈ పరికరాన్ని బొటన వేలికి ధరించాలి.. బ్లూటూత్‌ సహాయంతో ఇది ఆయా ఎలక్ట్రానిక్‌ పరికరాలతో అనుసంధానమవుతుంది. అప్పుడు అరచేతిలో చిన్న తాకడం, గీకడం వంటి సంకేతాలతో ఆ వస్తువులను ఆపరేట్‌ చేయొచ్చు. ఒకేసారి మూడు పరికరాలను ఫిన్‌తో నియంత్రించొచ్చు. ప్రస్తుతం దీనిలో ముందుగా ప్రోగ్రామ్‌ చేసిన అయిదు రకాల సంజ్ఞల ద్వారా వస్తువులను నియంత్రించే వీలుంది.. అయితే ఓ ప్రత్యేకమైన అప్లికేషన్‌(ఆప్‌) ఉపయోగించే మనకు నచ్చిన(కస్టమైజ్డ్‌) మరికొన్ని ప్రొగ్రామ్‌లనూ అన్వయించుకోవచ్చు. టీవీ శబ్దం తగ్గించడం, పెంచడం.. ఫోన్‌ను తాకకుండానే నంబర్లు డయల్‌ చేయడం, సంక్షిప్త సందేశాలు పంపడానికి వీలవుతుంది. రోహిల్‌దేవ్‌ నట్టుకలింగాల్‌ అనే భారతీయుడికి చెందిన ఆర్‌హెచ్‌ఎల్‌ టెక్నాలజీస్‌ ఈ ఫిన్‌ను తయారుచేసింది.
  ఏమో ఈమెయిల్ ఎగరావచ్చు!

  లండన్: సందేశాలు నేరుగా మీ చెవి వద్దకు ఎగిరి వచ్చేస్తాయి. ట్వీట్లు (ట్విట్టర్లో చేసే వ్యాఖ్యలు) మీ చుట్టూ గాల్లో తిరుగుతూ ఉంటాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇలాంటివన్నీ సాధ్యమంటున్నారు బెర్లిన్ టెక్నికల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వీరు ధ్వనిఆధారిత సందేశాల కోసం 'బూంరూం'ను రూపొందించారు. ఇక్కడ సందేశాలను ధ్వనితరంగాలుగా మార్చి పంపే వీలుంటుంది.


  ఇక్కడ 50కిపైగా స్పీకర్లతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది శబ్దాన్ని లక్షిత వ్యక్తి మాత్రమే వినేలా చేసి.. దాన్ని అతనికి చేరవేస్తుంది. ఈ మేరకు ఈ కొత్త వ్యవస్థ వివరాలను న్యూ సైంటిస్ట్ వెల్లడించింది. గెస్చర్ రికగ్నైజింగ్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల ద్వారా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  క్వర్టీ కీబోర్డ్‌పైనే తెలుగు !

  కంప్యూటర్‌లో తెలుగుని టైప్‌ చేస్తున్నాం. డాక్యుమెంట్స్‌ని రూపొందించే క్రమంలో తెలుగుకి స్థానం కల్పిస్తున్నాం. మరి, మొబైళ్ల సంగతేంటి? తెలుగులో మెసేజ్‌నో... మరేదైనా సమాచారాన్నో రాసుకుని భద్రం చేసుకోవాలంటే? అందుకు తగిన ఆప్స్‌ సిద్ధంగా ఉన్నాయి. కావాలంటే Telugu Pad ఆప్‌ని ప్రయత్నించండి. మీ మొబైల్‌కి Unicode సపోర్ట్‌ ఉన్నట్లయితే క్వర్టీ కీబోర్డ్‌పైనే తెలుగులో టైప్‌ చేయవచ్చు. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా తెలుగులో టైప్‌ చేసుకునే వీలుంది.


  ఉదాహరణకు 'అమ్మ భాష' అని టైప్‌ చేయాలంటే amma bhasha అని టైప్‌ చేస్తే సరిపోతుంది. ఇలా టైప్‌ చేసిన మేటర్‌ని ఫైల్‌ రూపంలో సేవ్‌ చేయవచ్చు. మెసేజ్‌ పంపాలనుకుంటే మేటర్‌ని టైప్‌ చేశాక SMSపైన క్లిక్‌ చేస్తే పరిపోతుంది. టెక్స్ట్‌ని మెయిల్‌ కూడా చేయవచ్చు. సెలెక్ట్‌ చేసి కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్‌ చేయవచ్చు.
  ఈ ఆప్ కోసం
  ఆండ్రాయిడ్‌ యూజర్లు Click here: http://goo.gl/TDl4gK
  * ఇలాంటిదే మరోటి Lipikaar Telugu Typing. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత కీబోర్డ్‌ని ఎంపిక చేసుకోవడం ద్వారా టైప్‌ చేయవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి కీబోర్డ్‌ని ఎనేబుల్‌ చేయవచ్చు.
  Click here: http://goo.gl/o7bYg4
  జ్ఞాపకాల్ని ­- ప‌దిలం చేసుకోండి !

  సంప్రదాయ పద్ధతిలో డైరీ అంటే నిత్యం వెంటే ఉంచుకోవడం కొంచెం కష్టమే. ఎవరి కళ్లలోనైనా పడొచ్చు. లేదంటే మనమే మర్చిపోతుంటాం. రాయాలంటే పెన్ను ఎప్పుడూ జేబులో ఉండాల్సిందే. అదే స్మార్ట్‌ డైరీలు అయితే! ఎప్పుడంటే అప్పుడు... ఎక్కడంటే అక్కడ రాసుకుని భద్రం చేసుకోవచ్చు.


  కావాల్సిందల్లా చేతిలో స్మార్ట్‌ మొబైల్‌ ఉంటే చాలు. ఆప్‌ స్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని జ్ఞాపకాల్ని భద్రం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ డైరీలో రోజువారీ దినచర్యల్ని రాసుకోవ‌చ్చు . మీరు ఉన్న లోకేషన్‌ని రికార్డ్‌ చేయడంతో పాటు వాతావరణ వివరాల్ని కూడా అందిస్తుంది. డైరీలోని డేటాని బ్యాక్‌అప్‌ చేయవచ్చు. ప్రీమియం వెర్షన్‌లో మరిన్ని అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఎంట్రీల్లో ఈవెంట్స్‌ ఉంటే ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ చేయవచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌ల్లోనూ షేర్‌ చేయవచ్చు. ఈ ఆప్‌కోసం
  * ఆండ్రాయిడ్ యుజ‌ర్లు http://goo.gl/35Cm2m
  * ఐఫోన్‌ వాడుతున్నట్లయితే iDiaryఆప్‌ని ప్రయత్నించండి. http://goo.gl/T1ZDzb
  మొబైల్ తో స్కాన్ చేయండి !

  పొద్దునే వార్తలు చదివేప్పుడు ఏదైనా ఆకట్టుకున్న కథనాన్ని స్కాన్‌ చేసి సాఫ్ట్‌ కాపీగా భద్రం చేసుకోవాలంటే? చెల్లించిన ఏదైనా రసీదుని స్కాన్‌ చేసుకుని సేవ్‌ చేయాలంటే? అందుకు స్కానరే అక్కర్లేదు. జేబులోని స్మార్ట్‌ మొబైల్‌ని స్కానర్‌లా మార్చేవయచ్చు. కావాలంటే Mobile Doc Scanner ఆప్‌ని ప్రయత్నించండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆప్‌లోని New Scan Via Shootఆప్షన్‌ ద్వారా కావాల్సిన వాటిని స్కాన్‌ చేయవచ్చు.


  మొబైల్‌ కెమెరా ద్వారా స్కాన్‌ చేసిన వాటిని వివిధ రకాల 'ప్రీసెట్స్‌'లో సేవ్‌ చేసుకోవచ్చు. రంగుల్లో అక్కర్లేదనుకుంటే 'బ్లాక్‌ అండ్‌ వైట్‌'లో సేవ్‌ చేయవచ్చు. ఎలాంటి మార్పులు లేకుండా స్కాన్‌ చేసేందుకు No Enhancementఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకోండి. స్కాన్‌ చేసిన వాటిని కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకునే వీలుంది. మొత్తం ప్రక్రియ ముగిశాక ఫైల్స్‌ని ఎస్‌డీ కార్డ్‌లో సేవ్‌ చేయవచ్చు. ఇంకా స్కాన్‌ కాపీలను క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసు 'డ్రాప్‌బాక్స్‌'లో దాచుకోవచ్చు. బ్లూటూత్‌తో ఇతరులు పంపొచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌ల్లోనూ షేర్‌ చేసే వీలుంది. స్కాన్‌ చేసిన మొత్తం ఫైల్స్‌ని 'మై స్కాన్స్‌'లో బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.
  ఈ ఆప్ కోసం
  * ఆండ్రాయిడ్‌ యూజర్లు Clcik here: http://goo.gl/XQfRvC
  * యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. Click here : http://goo.gl/nSgWZh
  వీడియో మాత్రమే చూడండి !

  You tube వీడియోలను చూసేట‌ప్పుడు సైనప్ప్, యాడ్ ఆన్స్, పాప్ అప్స్ ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి స‌మ‌స్యల‌ను లేకుండా వీడియో చూడ‌ల‌నుకుంటున్నారా అయితే Fewclick టూల్ వాడాల్సిందే. ముందుగా మీకు కావాల్సిన యూట్యూబ్ url link ని కాపీ చేసి Fewclick సైట్ టూల్ బార్‌లో కాపీ చేసి Search క్లిక్ చేయండి. మీకు html ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.ఆ ఫైల్ ని క్లిక్ చేయండి. మీరు చూడ‌ల‌నుకున్న వీడియో మాత్రమే Play అవుతుంది.


  Click here for more details..
  'Excel' lent చిట్కాలు !

  * ఎక్సెల్‌ వాడితే... టేబుళ్లు తయారు చేయడం అంద‌రికి తెలిసిందే. ఎక్సెల్‌ లోని స్ప్రెడ్‌షీట్‌ సెల్స్‌లో టైప్‌ చేసిన డేటాని సిస్టం చదివి వినిపిస్తుంది తెలుసా? అందుకు Text to Speech ఉంది. 'క్విక్‌ యాక్సెస్‌ టూల్‌బార్‌' సెట్టింగ్స్‌లోకి వెళ్లి More Commands ->Customize ఆప్షన్ని సెలెక్ట్‌ చేయాలి. వచ్చిన మెనూల్లోని All Commands లోకి వెళితే Speak cells కమాండ్‌ కనిపిస్తుంది.


  క్విక్‌ యాక్సెస్‌ టూల్‌బార్‌కి కమాండ్‌ని యాడ్‌ చేశాక ఎప్పుడైనా సెల్స్‌లోని డేటాని వినాల్సివస్తే 'స్పీక్‌ సెల్స్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరి.
  * ఒకే రకమైన టెక్స్ట్‌ని వివిధ స్ప్రెడ్‌షీట్స్‌లో టైప్‌ చేయాల్సివస్తే? Ctrlమీటని నొక్కి ఉంచి అన్ని షీట్‌లను సెలెక్ట్‌ చేయాలి. తర్వాత షీట్స్‌ని సెలెక్ట్‌ చేసి డేటాని టైప్‌ చేస్తే అన్ని షీట్స్‌లోనూ ఒకేసారి టైప్‌ అవుతుంది.
  * టేబుల్‌ సెల్స్‌లో తేదీని షార్ట్‌కట్‌ ద్వారా ఇన్‌సర్ట్‌ అయ్యేలా చేసేందుకు Ctrl+;కలిపి నొక్కాలి. టైమ్‌ని ఎంటర్‌ చేయాల్సివస్తే Ctrl+Shift+;మీటల్ని వాడాలి.
  * తయారు చేసిన డేబుల్‌కి 'ఇన్‌స్టెంట్‌ ఛార్ట్‌'ని క్రియేట్‌ చేయడానికి F11లేదా Alt+F1 మీటల్ని వాడొచ్చు.s
  * ఒక్కసారి ఛార్ట్‌ని ఇన్‌సర్ట్‌ చేశాక ఏదైనా ఫార్మెట్‌ చేయాలంటే ఛార్ట్‌పై డబుల్‌ క్లిక్‌ చేస్తే సరి.
  * ఏదైనా సెల్‌కి హైపర్‌లింక్‌తో ఫైల్‌ని జత చేయాలంటే? సింపుల్‌గా Ctrl+H నొక్కండి. వచ్చిన విండో నుంచి ఫైల్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి.
  * ఒక షీట్‌లో సెల్స్‌ వేలల్లోనే. మరి, మీకు కావాల్సిన సెల్‌ అడ్రస్‌కి వెళ్లాలంటే F5షార్ట్‌కట్‌ని వాడొచ్చు.
  * పాయింటర్‌ ఎక్కడున్నప్పటికీ మెనూబార్‌ని యాక్టివేట్‌ చేయడానికి F10 కీని నొక్కొచ్చు.
  మొబైల్‌తో కార్‌పార్కింగ్‌

  అదిరే సౌండ్‌ !

  ల్యాపీకో... మొబైల్‌కో అనుసంధానం చేసి ఫుల్‌ సౌండ్‌తో మ్యూజిక్‌ మజా చేయాలా? అయితే, కనిపించే 'సౌండ్‌ బార్‌' ఉంటే సరి. పేరు Portronics Pure Sound Pro BT. దీంట్లో మల్టిపుల్‌ స్పీకర్లని నిక్షిప్తం చేశారు. సామర్థ్యం 2.5 Watt RMS. ల్యాపీ, ట్యాబ్‌, మొబైళ్లకి వైర్‌లెస్‌గా కనెక్ట్‌ అయ్యి పాటలు వినొచ్చు.


  అందుకు బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో స్పీకర్‌ కనెక్ట్‌ అవుతుంది. ట్రాక్స్‌ని సెలెక్ట్‌ చేసుకునేందుకు ఎస్‌సీడీ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే ప్యానల్‌ కిందే కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి స్పీకర్‌ని ఛార్జ్‌ చేస్తే 8 గంటల పాటు మ్యూజిక్‌ వినొచ్చు. రిమోట్‌ కంట్రోల్‌తోనూ స్పీకర్‌ని ఆపరేట్‌ చేసుకునే వీలుంది. స్పీకర్‌లోని ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌తో మెమొరీ చిప్‌ని ఉంచి పాటలు వినొచ్చు కూడా. ఇన్‌బిల్ట్‌గా ఎఫ్‌ఎం ఉంది.
  Click here for more details
  అదిరే టెక్స్ !

  ఇంటెక్స్ కంపెనీ Mediatek's 1.7 Ghz true octa core ప్రాసెసర్‌తో కొత్త మోడల్‌ని అందిస్తోంది. పేరు Aqua Octa. ఈ పవర్ ప్రాసెసర్‌తో దేశంలో తొలిసారి అందుబాటులోకి మొబైల్ ఇదే. డ్యూయల్ సిమ్‌తో ఫోన్ని వాడుకోవచ్చు. తాకే తెర పరిమాణం 6 అంగుళాలు. రిజల్యూషన్ 1280ప720పిక్సల్స్. ఫోన్ని నాజూకుగా 7ఎంఎం మందంతో రూపొందించారు. ర్యామ్ 2 జీబీ. ఇంటర్నల్ స్టోరేజ్ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. డ్యుయల్ కెమెరాలు (ముందు 5 మెగాపిక్సల్, వెనక 13 మెగాపిక్సల్...) ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 2,300 mAh. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటలు వస్తుంది. ఉచితంగా 5 జీబీ క్లౌడ్‌స్టోరేజ్‌ని అందిస్తున్నారు కూడా.


  డ్యూయల్‌ ట్యాబ్లెట్‌ !

  డ్యూయల్‌ సిమ్‌తో ట్యాబ్లెట్‌ వాడాలనుకుంటే ఐబాల్‌ కంపెనీ తయారు చేసిన Slide 3G Q1035 గురించి తెలుసుకోవాల్సిందే. మొట్టమొదటిగా అందుబాటులోకి వచ్చిన దేశీయ డ్యూయల్‌ ట్యాబ్‌ ఇదేనట. తాకేతెర పరిమాణం 10.1 అంగుళాలు. 1.2Ghz quad core ప్రాసెసర్‌ని వాడారు.

  3జీ నెట్‌వర్క్‌తో వెబ్‌ విహారం చేయవచ్చు. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. ఎక్సటర్నల్‌ మెమొరీని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. తెర రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. ముందు 2 మెగాపిక్సల్‌, వెనక 8 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో నిక్షిప్తం చేశారు. వెనక కెమెరా లెడ్‌ ఫ్లాష్‌తో ఫొటోలు తీయొచ్చు. ఎఫ్‌ఎం రేడియోని రికార్డ్‌ చేసుకునే వీలుంది. మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్‌ ఉంది. దీంతో ట్యాబ్‌ని స్మార్ట్‌ టీవీకి అనుసంధానం చేసి స్క్రీన్‌ని షేర్‌ చేయవచ్చు. అంటే... ట్యాబ్‌లోని ఫొటోలు, వీడియోలు, సినిమాలను స్మార్ట్‌ టీవీలోనే చూడొచ్చన్నమాట. బ్యాటరీ సామర్థ్యం ఎక్కువే. 6,000mAh బ్యాటరీతో వీడియోని 6 గంటలు చూడొచ్చు. వై-ఫై, బ్లూటూత్‌, మైక్రో యూఎస్‌బీలు ఈ ట్యాబ్ ప్ర‌త్చేక‌త‌లు.

  Look at the time in a different way !

  Holo Text Clock makes you look at the time in a different way. The display is a grid of letters, of which some are illuminated. Read out, they form a sentence describing the current time in five minute intervals, for example It is five past ten. Four lights at the bottom indicate the minutes to be added to get the exact time. Currently, you can use Holo Text Clock in three different ways.

  Click here for more details

   

  చిటికెలో మాయం చేయండి !
  దైనా ముఖ్యమైన ఫోల్డర్‌, ఫైల్‌నిగానీ కనిపించకుండా చేయాలంటే వాటిపై రైట్‌క్లిక్‌ చేసి ప్రొపర్టీస్‌లోకి వెళ్లి చేయాలి. కాస్త ఎక్కువ సమయాన్నే వెచ్చించాలి. అలా కాకుండా ప్రత్యేక టూల్‌తో చిటికెలో చక్కబెట్టేయవచ్చు. అందుకు తగిన టూల్‌ Attribute Changer.
  విండోలో ట్యాబ్‌ల వారీగా ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు ఫైల్‌, ఫోల్డర్‌ ప్రాపర్టీలను మార్చాలనుకుంటే Read only, Hidden, Archive, System, Compress... మోడ్స్‌లో సెట్‌ చేయవచ్చు. క్రియేట్‌, మోడిఫైడ్‌... తేదీల్లో మార్పులు చేసేందుకు ModifyDate and time... సెట్టింగ్స్‌లో మార్చొచ్చు. అప్త్లె చేసిన సెట్టింగ్స్‌ని సిస్టం స్టార్ట్‌అప్‌లోనే పని చేయాలనుకుంటే 'సెట్టింగ్స్‌' ట్యాబ్‌లోకి వెళ్లి మార్చొచ్చు.

  Click here for more details

  sophisticated calendar app

  SolCalendar is an exceptionally practical and convenient calendar app which comes with a simple but advanced design. Users can check on all the important events immediately with its "split view" at a single touch. The weather information for upcoming 7 days helps users set up their schedule effectively. And the events can be shared with friends and peers through various methods including texting and mobile messengers, email or social media and also More than 30 different beautiful widgets are attracting those who were getting sick of boring Android widgets. It is possible to visualize events on the calendar by decorating with adorable stickers.

  Click here for more details

  ఫోనూ + ట్యాబ్‌ = ప్యాడ్‌ఫోన్‌

  ఫోన్‌ ఉంటే ట్యాబ్లెట్‌ లేదని.. ట్యాబ్‌ ఉంటే ఫోన్‌ లేదని చింతిస్తున్నారా? లేదా ఫోన్‌, ట్యాబ్‌ రెంటినీ వాడడం కష్టంగా ఉందా? అయితే, ఫోన్ని ట్యాబ్‌లో పెట్టుకుని వాడుకుంటే? అదెలాగబ్బా? అనే సందేహం వస్తే అసుస్‌ కంపెనీ రూపొందించిన PadFone Mini గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో చూపిన మాదిరిగా మొబైల్‌ని ట్యాబ్‌లో డాక్‌ చేసుకుని వాడుకోవచ్చు. మొబైల్‌ తెర పరిమాణం 7 అంగుళాలు అయితే... ట్యాబ్‌ తెర సైజు 7 అంగుళాలు. దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే... ఫోన్‌ కాల్స్‌ చేసేప్పుడు సాధారణ మొబైల్‌లా వాడుకోవచ్చు. బ్రౌజింగ్‌ చేయాల్సివస్తే ఫోన్ని ట్యాబ్లెట్‌కి వెనక భాగంలో డాక్‌ చేసి ట్యాబ్‌లో బ్రౌజింగ్‌ చేయవచ్చు. డాక్‌ చేయగానే మొబైల్‌ తెర యథాతదంగా ట్యాబ్‌పైకి వచ్చేస్తుంది. ఫోన్‌ రిజల్యూషన్‌ 960X540పిక్సల్స్‌. 1.4Ghz Quad Core Snapdragon 400ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 8 మెగాపిక్సల్‌, ముందు 2 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో పని చేస్తాయి. ఇక డాకింగ్‌ ట్యాబ్‌ కాన్ఫిగరేషన్‌ విషయానికి వస్తే... ట్యాబ్‌ రిజల్యూషన్‌ 1280X720పిక్సల్స్‌. బ్యాటరీ సామర్థ్యం 2,200mAh. దీని ద్వారా ఫోన్ని కూడా ఛార్జ్‌ చేసుకునే వీలుంది. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్‌లో సందడి చేస్తున్న ఈ ప్యాడ్‌ఫోన్‌ త్వరలోనే దేశీయ మార్కెట్‌లోకి రానుంది.

  టీవీ బెండయ్యింది!

  ప్పటి వరకూ టీవీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఇక 'కర్వ్‌' ఆకారంలో ముస్తాబయ్యాయి. కావాలంటే ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన LG Curved OLED టీవీని చూడండి. ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన మొదటి టీవీ కూడా ఇదే. తెర పరిమాణం 55 అంగుళాలు. హెచ్‌డీ డిస్‌ప్లేతో సినిమాలు చూడొచ్చు. ఎల్‌జీకి ప్రత్యేకమైన '4 కలర్‌ పిక్సల్‌ టెక్నాలజీ'ని వాడారు. 2డీలోనే కాకుండా 3డీలోనూ వీడియోలను చూడొచ్చు. ఇన్‌బిల్ట్‌గానే వై-ఫై, డీఎల్‌ఎన్‌ఏ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ సౌకర్యాలు ఉన్నాయి. రిజల్యూషన్‌ నాణ్యత 1920X1080పిక్సల్స్‌. టీవీలో నిక్షిప్తం చేసిన స్పీకర్లు 40 వాట్స్‌తో వినిపిస్తాయి. టీవీ రిమోట్‌లో Gesture Controls కూడా ఉన్నాయి.

  Click here for more details

  ఇదిగో ప్రత్యామ్నాయం !

  డాక్యుమెంట్ ప్రిపేర్ చేయ‌డానికి ఎమ్మెస్‌ ఆఫీస్ వాడ‌ని వారంటు ఉండ‌రు అనండంలో ఆశ్చర్యం లేదు. అంత‌గా ప్రాచుర్యం పొందింది ఎమ్మెస్ ఆఫీస్. మరి దానికి ప్రత్యామ్నాయంగా మ‌రో టూల్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది అదే LibreOffice ఇప్పుడు చాలా మంది ఎమ్మెస్‌ ఆఫీస్ కి ప్రత్యామ్నాయంగా LibreOffice నే వాడుతున్నారు. మ‌రేందుకు ఆల‌స్యం మీరు ప్రయ‌త్నించి చూడండి.

  Click here for more details

  ఆటోమాటిక్‌గానే!

  త‌‌ర‌చుగా ఒకే ప‌నిపై డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేవారు కొన్ని ప‌దాల‌ను, వాక్యాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం స‌హ‌జం. అలాంటి వారికి సుల‌భంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయ‌డానికి, వారు వాడే వాక్యాల్ని ఆటోమాటిక్‌గా ఇన్ స‌ర్ట్ చేసే టూల్ సిద్దంగా ఉంది. అదే Phrase Express ఒక్కమాటలో చెప్పాలంటే స్పెల్‌చెక్‌ మాదిరిగా పని చేస్తుందన్నమాట. మీరు ఓ సారి వాడిన ప‌దాల‌ను, వాక్యాల‌ను పూర్తిగా రాయ‌క‌ముందే ఇన్ స‌ర్ట్ అయ్యే విధంగా ఈ టూల్ ని రూపొందించారు.

  Click here for more details

  మొబైల్‌ మీట.. తెలుగు మాట
  * అందుబాటులోకి నూతన యాప్‌
  * 30 నుంచి అందుబాటులోకి
  మొబైల్‌ ఫోన్ల నుంచి సంక్షిప్త సందేశాలను ఇకపై తెలుగులోనూ పంపుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు భాషలోనే తెలుగు కీబోర్డుతో సంక్షిప్త సమాచారాలు పంపుకొనే అవకాశాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్‌ వర్షన్‌, ఐఫోన్‌, ట్యాబ్లెట్‌లకు అందుబాటులోకి రానుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'తెలుగుమాట' అనే అప్లికేషన్‌ను (యాప్‌) రూపొందించింది. ఈ నెల 30న అధికారికంగా అందుబాటులోకి తేనుంది. వినియోగదారులు teluguvijayam.org వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా ఈ అప్లికేషన్‌ను పొందవచ్చు. కొత్త యాప్‌లో ఒత్తులు, గుణింతాలు అందుబాటులో ఉంటాయి. ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చుకునే విధానం కూడా సులభంగా ఉంటుంది.
  ఇన్‌స్టాల్‌ చేసుకునే విధానం ఇదీ:
  * teluguvijayam.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తెలుగుమాట యాప్‌ను ఆండ్రా యిడ్‌, ఐఫోన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  * ఫోన్‌లో తెలుగుమాట అనే అప్లికేషన్‌ ప్రత్యక్షమవుతుంది.
  * దాంట్లో 'అమర్పు కోసం' క్లిక్‌ చేసి అందులోని తెలుగుమాట ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలి.
  * దీంతో ఫోన్‌లో సందేశం లేదా మెయిల్‌ను పూర్తిగా తెలుగు కీ బోర్డు సహాయంతో తెలుగులో రాసి పంపవచ్చు.
  * కీబోర్డులో అక్షరాలు 2 శ్రేణుల్లో అందుబాటులో ఉంటాయి. క, గ, చ.... మొదటి శ్రేణిలో ఉండగా, రెండవ శ్రేణిలో ఖ, ఘ, ఛ... వంటి అక్షరాలు ఉంటాయి.
  భలే బ్రౌజర్ !
  పీసీలో మాదిరిగానే అన్ని హంగులతో మొబైల్‌ బ్రౌజర్‌ని వాడుకునేలా సరికొత్త వెర్షన్‌తో మరోటి ముందుకొచ్చింది. అదే UC Browser. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, సింబియాన్‌, బ్లాక్‌బెర్రీ, విండోస్‌ ఫోన్‌, జావా బేస్డ్‌ ఓఎస్‌ యూజర్లు బ్రౌజర్‌ని వాడుకోవచ్చు. ట్యాబ్లెట్స్‌కి అనువుగా ప్రత్యేక సిస్టంని ఏర్పాటు చేశారు. దీంట్లోని సౌకర్యాల విషయానికొస్తే... బ్రౌజర్‌లో ఏదైనా కొత్త పేజీలో ఓపెన్‌ చేయాలంటే? ట్యాబ్‌ విండో తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్‌ చేసుకుని చూస్తాం. కానీ, దీంట్లో Auto Pager ద్వారా బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి ట్యాబ్‌లను స్క్రోల్‌ చేస్తూ ఒకదాని తర్వాత మరోటి చూడొచ్చు.

  ఈ బ్రౌజ‌ర్ లోని మ‌రిన్ని ప్రత్యేక‌త‌లు
  * వాడుతున్న నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఆధారంగా బ్రౌజర్‌ మోడ్‌ని మార్చుకునే వీలుంది. దీంతో వెబ్‌ పేజీలు వేగంగా ఓపెన్‌ అవుతాయి.
  * బ్రౌజర్‌లో పెట్టుకున్న బుక్‌మార్క్‌లను క్లౌడ్‌ స్టోర్‌లోకి సింక్రనైజ్‌ చేసుకునే వీలుంది.
  * 'డౌన్‌లోడ్‌ మేనేజర్‌' ద్వారా నెట్‌ నుంచి చేస్తున్న డౌన్‌లోడ్స్‌ని సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. ఫైల్‌ ఎక్కడ డౌన్‌లోడ్‌ అవుతున్నదీ సులభంగా తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌లో ఉన్నవాటిని, బ్రోకెన్‌ డౌన్‌లోడ్స్‌ని గుర్తించడం చాలా వీజీ. నెట్‌వర్క్‌ సమస్య వల్ల డౌన్‌లోడ్స్‌ ఫెయిల్‌ అయ్యినప్పుడు తిరిగి అదే లింక్‌కి ఆటోమాటిక్‌గా కనెక్ట్‌ అయ్యి ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేస్తుంది.
  * వై-ఫై కనెక్షన్‌ అందుబాటులో ఉన్నప్పుడు నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తుంది.
  * నెట్‌వర్క్‌లో ఏదైనా సమస్య వస్తే నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
  * బ్రౌజర్‌ని క్లోజ్‌ చేసినప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌ జరుగుతూనే ఉంటుంది.
  * బ్రౌజర్‌లో సందర్శించిన ఏ వెబ్‌సైట్‌కి అయినా QR Code జనరేట్‌ చేసుకుని సులభంగా షేర్‌ చేయవచ్చు.
  * అన్నిసార్లు సైట్‌ యూఆర్‌ఎల్‌ని టైప్‌ చేయకుండా Add Gesture ద్వారా ఏదైనా ఆకారాన్ని గీయవచ్చు. ఇక ఎప్పుడైనా ఆ సైట్‌ని చూడాలంటే ఆకారాన్ని తెరపై గీసి సైట్‌లోకి వెళ్లొచ్చు.
  * థీమ్స్‌తో బ్రౌజర్‌ని ఆకట్టుకునేలా మార్చుకునే వీలుంది.
  * రాత్రి సమయంలో బ్రౌజ్‌ చేయాల్సివస్తే 'నైట్‌ మోడ్‌'ని సెలెక్ట్‌ చేసుకుని కళ్లకి ఎక్కువ ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడొచ్చు.
  * ప్రత్యేక యాడ్‌ఆన్స్‌ ద్వారా అదనపు సౌకర్యాల్ని బ్రౌజర్‌కి జత చేయవచ్చు. అందుకు తగిన 'యాడ్‌ఆన్‌ ప్లాట్‌ఫాం' ఉంది.
  * హిస్టరీ సేవ్‌ అవ్వకుండా ఏదైనా వ్యక్తిగత బ్రౌజింగ్‌ చేయాలనుకంటే Incognito Browsing మోడ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. మరి ిం డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు www.ucweb.com లోకి వెళ్లిండి
  .
  ఒక్క క్లిక్‌తో సైజ్ త‌గ్గించేయండి !
  మెయిల్‌ చేయల్సి వ‌చ్చిన‌ప్పుడు లేదా మరేదైనా అవసరానికో కొన్నిసార్లు ఉప‌యోగించే ఇమేజ్ ఫైల్స్ సైజ్ పెద్దగా ఉంటే ఇబ్బందే.. అలాంట‌ప్పుడే SendTo-Convert మీ స‌మ‌స్యని ప‌రిష్కరిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ని ఇన్ స్టాల్ చేసుకుని మ‌న‌కు అవ‌స‌ర‌మైన ఇమేజ్ పై రైట్ క్లిక్ చేస్తే SendTo-Conver టూల్ క‌న‌ప‌డుతుంది. దానిపై క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ తో పాటు ఫార్మెట్ కూడా మార్చుకోవ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే సాఫ్ట్‌వేర్ ని డౌన్ లోడ్ చేసుకోండి.
  click here for more details: http://goo.gl/6mbZdZ
  ఫార్మెట్‌ మార‌కుండా కాపీ చేయండి !

  ఎమ్మెస్‌ వర్డ్‌లో తయారు చేసిన డాక్యుమెంట్‌లోని Text ని కాపీ చేస్తే మొత్తం మనం చేసిని text format తో సహ కాపీ అవుతుంది. అంటే టెక్స్ట్‌కి apply చేసిన ఫాంట్‌ స్టెల్‌, రంగు, అండర్‌లైన్‌, బోల్డ్‌, హైపర్‌లింక్‌... ఇలా ఏవైనా కావచ్చు మారకుండా ఉంటాయి . ఇదే విధంగా వెబ్‌ సైట్స్‌లో కాపీ చేసిన Text కూడా మారకుండా ఎలా ఉందో అదే format లో కాపీ అవుతుంది. త‌రువాత మ‌ళ్లీ మ‌న‌కు న‌చ్చిన‌ format లోకి మార్చుకోవాలంటే క‌ష్టంగా ఉంటుంది. అలా కాకుండా 'నార్మల్‌ టెక్స్ట్‌'ని మాత్రమే కాపీ చేసుకుంటే మ‌న‌కు న‌చ్చిన‌ట్లు మార్చుకోవ‌డం చాలా సుల‌భం. అలా 'నార్మల్‌ టెక్స్ట్‌' మాత్రమే కాపీ అవ్వాల‌నుకుంటున్నారా... అందుకో మీరు ఓ స్మార్ట్ టూల్ వాడాల్సిందే. అదే PureText దీంతో అన్ని Text ఫార్మెట్‌లను తొలగించొచ్చు. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రేలో చేరిపోతుంది. ఇక ఏదైనా డాక్యుమెంట్‌లోని టెక్స్ట్‌ని కాపీ చేసి సిస్టం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేయాలి. తర్వాత కావాల్సిన చోట Text పేస్ట్‌ చేస్తే 'ప్లెయిన్‌ టెక్స్ట్‌' వస్తుంది. సిస్టం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపై రైట్‌క్లిక్‌ చేసి 'ఆప్షన్స్‌'లోకి వెళ్లి షార్ట్‌కట్‌ మీటల్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

  Click here for more details

  క్వర్టీ కీప్యాడ్‌ స్త్టెల్‌ !
  ఫోన్‌ వాడకం బాగా పెరిగింది. వెర్షన్లు మార్చుకుంటూ మరింత స్లిమ్‌ అవుతూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరింత సౌకర్యంగా వాడుకునేలా ఐఫోన్‌కి క్వర్టీ కీబోర్డ్‌ని కూడా తగిలించొచ్చు. అదీ బ్లాక్‌బెర్రీలో ఉండే క్వర్టీ కీప్యాడ్‌ స్త్టెల్‌లో. ఆన్‌స్క్రీన్‌ కీబోర్డ్‌ నచ్చిన యూజర్లు ఈ క్వర్టీ కీప్యాడ్‌ని ఫోన్‌కి డాక్‌ చేసి వాడుకోవచ్చు. పేరు Typo Keyboard Case. ఐఫోన్‌ 5, 5S మోడళ్ల అనువుగా కేస్‌ని రూపొందించారు. కచ్చితంగా చెప్పాలంటే కీబోర్డ్‌ 'బ్లాక్‌బెర్రీ బోల్డ్‌' మోడల్‌ని పోలి ఉంటుంది. దీని ద్వారా 50 శాతం వేగంగా టైప్‌ చేయవచ్చని రూపకర్తలు చెబుతున్నారు. బ్లూటూత్‌ ద్వారా కీబోర్డ్‌ని ఫోన్ని అనుసంధానం చేయవచ్చు. మైక్రోయూఎస్‌బీ పోర్డ్‌తో ఛార్జ్‌ చేయవచ్చు. రాత్రి సమయంలో అనువుగా టైప్‌ చేసుకునేందుకు Backlit ద్వారా కీబోర్డ్‌ మీటల వెనక లైటు వెలుగుతుంది. ఫోన్‌కి రక్షణ కవచం మాదిరిగా ఉపయోగపడుతుంది. త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ సందడి చేయనుంది. వివరాలకు http://typokeyboards.com లింక్‌లోకి వెళ్లండి.
  ఒక్క క్లిక్ తో క్లిన్ చేయండి!
  వెబ్‌ విహారానికి ఏదో ఒక బ్రౌజర్‌ వాడాలి. ప్రైవసీ నిమిత్తం ఎప్పటికప్పుడు బ్రౌజింగ్‌ హిస్టరీపై ఓ కన్నేస్తుండాల్సిందే. అక్కర్లేని వాటిని... ఇతరుల కంటపడకూడదు అనుకున్నవాటిని హిస్టరీ నుంచి తొలగిస్తుంటాం. అందుకు బ్రౌజర్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఆప్షన్లు ఉన్నాయి. వాటితో పనేం లేకుండా ఒకే క్లిక్‌తో మొత్తం వెబ్‌ ప్రైవసీని మేనేజ్‌ చేయవచ్చు. అందుకు తగిన వెబ్‌ సర్వీసు సిద్ధంగా ఉంది. అదే Click & Clean. ఫైర్‌ఫాక్స్‌, క్రోమ్‌ యూజర్లు దీన్ని ఎక్స్‌టెన్షన్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. మీరు ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నట్లయితే http://goo.gl/8wVfMx లింక్‌లోకి వెళ్లండి. బ్రౌజర్‌కి యాడ్‌ చేసి రీస్టార్ట్‌ చేయాలి. దీంతో అడ్రస్‌బార్‌ పక్కనే ప్రత్యేక ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి 'బ్రౌజర్‌ హిస్టరీ'ని మేనేజ్‌ చేయవచ్చు. మొత్తం హిస్టరీని తొలగించాలనుకుంటే Clear Browsing Data ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. కావాలంటే Alt+C షార్ట్‌కట్‌ని కూడా వాడుకోవచ్చు. యాడ్‌ఆన్‌తో ట్యాబ్‌ విండోలను కూడా మేనేజ్‌ చేయవచ్చు. ప్రైవేటు బ్రౌజింగ్‌ చేయడానికి Incognito ఆప్షన్ని సెలెక్ట్‌ చేయండి. బ్రౌజర్‌ 'కూకీస్‌'పైనా ఓ కన్నేయాలనుకుంటే Cookies మెనూలోకి వెళ్లొచ్చు. జాబితాని బ్రౌజ్‌ చేసి కావాల్సిన వాటిని తొలగించొచ్చు. 'ప్రైవసీ టెస్ట్‌' కూడా చేయవచ్చు.
  * క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే 'వెబ్‌ స్టోర్‌' నుంచి ఎక్స్‌టెన్షన్ని పొందొచ్చు. http://goo.gl/k4ZlhL లింక్‌లోకి వెళ్లండి.
  డేటాను దాచుకోండిలా...!
  సిస్టంలో ఏవేవో ఫైల్స్‌ని సేవ్‌ చేస్తుంటాం. వాటిల్లో కొన్ని ముఖ్యమైన ఫైల్స్‌ ఉంటాయి. అనుకోకుండా సిస్టం క్రాష్‌ అయితే దాచుకున్న డేటా మాటేంటి? అందుకే ఎప్పటికప్పుడు డేటాని బ్యాక్‌అప్‌ చేసుకోవడం మంచింది. అందుకు ఎలాంటి టూల్స్‌ అక్కర్లేదు. విండోస్‌లోనే ఇన్‌బిల్ట్‌గా 'బ్యాక్‌అప్‌' ఆప్షన్‌ ఉంది. మీరు విండోస్‌ 7 వాడుతున్నట్లయితే Start-> Control Panel-> System and Maintenance -> Backup and Restore లోకి వెళ్లి డేటాని కావాల్సిన చోట సురక్షితంగా ఒక కాపీని పెట్టుకోవచ్చు. సిస్టంలోని మొత్తం డేటాని బ్యాక్‌అప్‌ చేసుకోవాలంటే విండోలోని Create New, Full Backup సెట్‌ చేయండి. ఒకవేళ కావాల్సిన డేటాని మాత్రమే బ్యాక్‌అప్‌ చేయాలనుకుంటే Setup Backup చేయాలి. ఇక ఎప్పుడైనా డేటాని రీస్టోర్‌ చేయాలనుకుంటే Backup and Restore -> Restore my files పైన క్లిక్‌ చేయాలి. ఈ ప్రాసెస్‌లో భాగంగా రీస్టోర్‌ చేయాలనుకునే ఫైల్స్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలనేది ఎంపిక చేసుకోవాలి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక 'రీస్టోర్‌'పైన క్లిక్‌ చేస్తే సరి.
  చార్జీంగ్ ఆదా చేయండిలా...!
  ల్యాప్ ట్యాప్ వాడుతున్నారా..అయితే చార్జీంగ్ ఆదా చేసుకోవాడానికి కోన్ని చిట్కాలు మీకోసం..
  * ల్యాపీ బ్లూటూత్‌తో పని లేకుంటే Turn bluetooth Off చేయండి.
  * డ్రైవ్‌ల్లో కొన్నిసార్లు అవసరం లేకున్నా డీసీ, డీవీడీలను రన్‌ చేస్తుంటాం. అవి రన్‌ అవుతుండడం వల్ల బ్యాటరీ ఛార్జ్‌ ఖర్చవుతుంది. వాటి అవసరం లేకుంటే Eject చేయండి.
  * ల్యాపీకి కనెక్ట్‌ చేసి ఉన్న యూఎస్‌బీ పరికరాల (ఫ్లాష్‌ డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డ్రైవ్‌లు, ఎక్సర్నల్‌ స్పీకర్లు...) వల్ల కూడా బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది. యూఎస్‌బీ పరికరాలతో పనిలేనప్పుడు డిస్‌కనెక్ట్‌ చేయండి.
  * పనిలో కాస్త విరామం తీసుకున్నప్పుడు ల్యాపీని అలా వదిలేయకుండా 'స్టాండ్‌బై' లేదా 'స్లీప్‌' మోడ్స్‌లో పెట్టడడం ద్వారా బ్యాటరీని ఆదా చేయవచ్చు. మరింత ఎక్కువ సమయం విరామం తీసునేప్పుడు hibernate మోడ్‌లో సెట్‌ చేయండి దీని వ‌ల్ల చార్జీంగ్ ఆదా అవుతుంది.
  * స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ని కూడా తగ్గించుకుంటే మంచిది.
  * పవర్‌ ఆప్షన్స్‌లోని Advanced Settings లోకి వెళ్లి మరింత అనువుగా బ్యాటరీ వాడకానికి సంబంధించిన సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు.
  అంతే కాకుండా స్టార్ట్‌అప్‌లో విండోస్‌ ఓఎస్‌తో పాటు రన్‌ అయ్యే ఆప్స్‌ ఉంటాయి. వాటినే స్టార్ట్‌అప్‌ ప్రొగ్రామ్‌లుగా పిలుస్తారు. వాటిల్లో అక్కర్లేని వాటిని క్లోజ్‌ చేయడం ద్వారా బ్యాటరీని ఆదా చేయవచ్చు.
  ఆరు అంగుళాల ఫ్యాబ్లెట్‌ !
  తొలిసారి 6 అంగుళాల పెద్ద తాకేతెరతో లూమియా 1520 స్మార్ట్‌ఫోన్‌ (ఫ్యాబ్లెట్‌)ను నోకియా దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. పూర్తి హెచ్‌డీ (1080 పి) ఐపీఎస్‌ ఎల్‌సీడీ తాకేతెర ఎండలోనూ తిలకించేందుకు అనువుగా ఉంటుందని సంస్థ పేర్కొంది. విండోస్‌ ఫోన్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌కు అత్యంత వేగంగా పనిచేసే 2.2 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 800 ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌ కలిగిన ఈ ఫోన్‌కు వెనుక 20 మెగాపిక్సెల్‌ ప్యూర్‌వ్యూ కెమెరా, ముందు మరో కెమెరా ఉన్నాయి. ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 10తో ఇంటర్‌నెట్‌ బ్రౌజ్‌ చేయవచ్చు. 3,400 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 2జీలో అయితే 27.4 గంటలు, 3జీలో 25.1 గంటలు మాట్లాడుకోవచ్చు లేదా 124 గంటల పాటు సంగీతాన్ని వినవచ్చు. 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు ఎస్‌డీ కార్డుతో 64 జీబీ పెంచుకోవచ్చు. క్లౌడ్‌ పద్ధతిలో 7జీబీ మెమొరీ ఉచితం. 8.8 మిల్లీమీటర్ల మందంతో 209 గ్రాముల బరువు ఈ ఫోన్ ప్రత్యేక‌త‌లు. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ను నిక్షిప్తం చేసినందున, విద్యార్థుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని సంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ ఎక్సేంజ్‌, ఆఫీస్‌ 365, లింక్‌ వంటి వ్యాపార అప్లికేషన్లు వినియోగించుకోనే స‌దుపాయం ఉంది.
  ఇక‌ ట్యాబ్లెట్ లో బొమ్మలు గీసేయోచ్చు!
  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్యాబ్లెట్‌ త్వరలోనే దేశీయ మార్కెట్‌లోకి వ‌స్తోంది. అదే EVGA TEGRA Note 7. దీని తాకే తెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. హెచ్‌డీ డిస్‌ప్లేతో దీన్ని వాడుకోవచ్చు. దీంట్లోని మరో ప్రత్యేకత గేమింగ్‌. ప్రముఖ గేమింగ్‌ ప్రాసెసర్ల తయారీ కంపెనీ Nvidiaఅందిస్తున్న Tegra 4ప్రాసెసర్‌ని దీంట్లో వాడారు. గేమింగ్‌కి అనువైన సౌండ్‌ సిస్టం, బ్యాటరీ బ్యాక్‌అప్‌ని ఏర్పాటు చేశారు. ఇన్‌బిల్ట్‌గా Nvidia Tegra గేమింగ్‌ కంట్రోల్స్‌ని నిక్షిప్తం చేశారు. ఈ ట్యాబ్లెట్ లో మీరు బొమ్మలు కూడా గీయ‌వ‌చ్చు అందుకు అనువైన Nvidia DirectStylus technology కి చెందిన Tegra Draw ఆప్‌ ఉంది. ఇంకా ట్యాబ్లెట్‌కి ముందు భాగంలో రెండు స్పీకర్లు ఉన్నాయి. ట్యాబ్‌కి పక్కన మరో ప్రత్యేక 'బేస్‌పోర్ట్‌' ఉంది. దీంతో గేమ్స్‌ ఆడేప్పుడు సౌండ్‌ సిస్టం మరింత ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 8 గంటల పాటు వీడియోలను చూడొచ్చు. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 GB వరకూ పెంచుకునే వీలుంది. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 5 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది. వీడియో కాలింగ్‌కి 'వీజీఏ' కెమెరా క‌లిగి ఉండ‌టం ఈ ట్యాబ్లెట్‌ ప్రత్యేక‌త‌..
  స్మార్ట్ గా ప‌ది భాషాలు
  ది భారతీయ భాషల్లో వినియోగించుకునే సౌలభ్యంతో మధ్యశ్రేణి డ్యూయల్‌సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ డ్యూస్‌2ను శామ్‌సంగ్‌ ఆవిష్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళీ, హిందీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో వినియోగించుకునేలా జీమెయిల్‌, ఫేస్‌బుక్‌, చాట్‌ఆన్‌తో పాటు మరిన్ని అప్లికేషన్లు శామ్‌సంగ్‌ స్టోర్‌లో ఉన్నాయి. 4 అంగుళాల తాకేతెర, 1.2 గిగాహెర్ట్జ్‌ డ్యూయల్‌కోర్‌ ప్రాసెసర్‌, 768 ఎంబీ ర్యామ్‌, 5 మెగాపిక్సెల్‌ కెమెరా, 4జీబీ అంతర్గత మెమొరీ, 1,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 3జీ కనెక్టివిటీ సదుపాయం కలిగి, ఆండ్రాయిడ్‌ జెల్లీబీన్‌ ప్లాట్‌ఫామ్‌ క‌లిగి ఉండ‌టం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేక‌త‌.
  క్లిక్ కొడితే తొమ్మిది రకాల ఫొటోలు . . .!
  ఫొటో తీసిన తర్వాత సెట్టింగ్స్‌ ద్వారా వివిధ రకాలుగా మార్చుకుంటాం. నచ్చిన ఎఫెక్ట్‌లను అప్త్లె చేస్తుంటాం. కానీ.. ఇవేం చేయకుండానే క్లిక్‌ కొట్టగానే తొమ్మిది రకాల స్త్టెల్స్‌లో ఫొటో వచ్చేస్తే? వాటిల్లో కావాల్సిన ఫొటోని ఎంపిక చేసుకుంటే? ఇది సాధ్యమే. అందుకు తగిన కెమెరాని Casio కంపెనీ తయారు చేసింది పేరు Casio Ex-10. ఇలాంటి సౌకర్యంతో అందుబాటులోకి వచ్చిన మెమొరీ కెమెరా ఇదే. 12 మెగాపిక్సల్‌ CMOSsensor సామర్థ్యం. 4Xఆప్టికల్‌ జూమ్‌ ఉంది. కెమెరా తాకే తెర పరిమాణం 3.5 అంగుళాలు. Tilt టచ్‌స్క్రీన్‌గా దీన్ని పిలుస్తున్నారు. కావాల్సినట్టుగా తెరని తిప్పుకుని ఫొటోలు చూడ‌వ‌చ్చు. హెచ్‌డీఎంఐ అవుట్‌, ఇన్‌బిల్ట్‌ WiFi... లాంటి మరిన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి.
  తాళం మ‌ర్చిపోతే ?
  స్మార్ట్‌ మొబైల్‌ వాడుతున్నవారందరూ 'పేట్రన్‌ లాక్‌' వాడుతూనే ఉంటారు. కొన్నిసార్లు లాక్‌ తీయడం మర్చిపోతుంటాం. లేదంటే కుటుంబ సభ్యులో, స్నేహితులో ఎక్కువ సార్లు ప్రయత్నించడం వల్ల పేట్రన్‌ లాక్‌ డిసేబుల్‌ అవుతుంది. మీ రిజిస్టరైన జీమెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయితేనే తిరిగి పని చేస్తుంది. తిరిగి కొత్త పేట్రన్‌ లాక్‌ని సెట్‌ చేసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు రిజిస్టరైన జీమెయిల్‌ లాగిన్‌ వివరాలు కూడా మర్చిపోతే? పేట్రన్‌లాక్‌ని డిసేబుల్‌ చేయడం ఎలా? అందుకో చిట్కా ఉంది. ఫోన్ని రీస్టోర్‌ చేసి తిరిగి వాడుకోవచ్చు. ఇలా రీసెట్‌ చేస్తే మొత్తం యూజర్‌ డేటా, సెట్టింగ్స్‌ తొలగిపోతాయి.

  'రీస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌' మాదిరిగా అన్నమాట. ఫోన్‌ మెమొరీ ఉన్న డేటా మొత్తం తొలగిపోతుంది. ఎస్‌కార్డ్‌లో మెమొరీ మాత్రం అలానే ఉంటుంది. Lock అయిన ఫోన్ని ముందుగా షట్‌డౌన్‌ చేయాలి. ఇప్పుడు ఫోన్‌లోని Volume Up బటన్‌ నొక్కి ఉంచితే 'ఆండ్రాయిడ్‌ రికవరీ స్క్రీన్‌' వస్తుంది. ఒకవేళ రాకపోతే పై రెండు 'కీ' లతో పాటు Home Screen బటన్‌ని కూడా నొక్కాలి. వచ్చిన రికవరీ స్క్రీన్‌లోని Wipe data / factory reset సెలెక్ట్‌ చేసి Yes ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొత్తం యూజర్‌ డేటా తొలగిపోయి తిరిగి రికవరీ స్క్రీన్‌ వస్తుంది. మెనూలోని Reboot System now ఆప్షన్ని సెలెక్ట్‌ చేయాలి. దీంతో ఫోన్‌ కొన్నప్పుడు ఎలా ఉందో అదే మాదిరిగా ఓపెన్‌ అవుతుంది. ఒకవేళ మీరు గతంలో యూజర్‌ డేటాని బ్యాక్‌అప్‌ చేసుకున్నట్లయితే తిరిగి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్‌ యూజర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే డేటా బ్యాక్‌అప్‌. స్మార్ట్‌ మొబైల్‌ వాడే యూజర్లు డేటాని ఎప్పటికప్పుడు ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవడం మంచిది. అనివార్య కారణాల వల్ల ఫోన్ని రీసెట్‌ చేస్తే డేటాని సురక్షితంగా బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన మెసేజ్‌లు ఏవైనా ఉంటే 'స్క్రీన్‌ కాప్చర్‌' చేసుకుని భద్రం చేసుకోవడం మంచిది.
  * డేటాని బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు గూగుల్‌ ప్లేలో చాలానే ఆప్స్‌ ఉన్నాయి. వాటిల్లో 'సూపర్‌ బ్యాక్‌అప్‌' ఒకటి. అన్నింటినీ ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు.

  Click here for more details: http://goo.gl/ZN0jtz

  * ఆప్స్‌ని మాత్రమే బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు App Backup & Restore ఉంది.
  Click here for more details: http://goo.gl/aljDTj


  ఒక ఫోన్ బ్యాట‌రీతో మ‌రో ఫోన్‌ను చార్జింగ్ చేయండి !
  మార్కేట్‌లోకి మ‌రో కొత్త ఫోన్ వ‌స్తుంది... 3-4 రోజుల పాటు చార్జింగ్‌ వచ్చే 4,400 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఎంఎక్స్‌100 డ్యూయల్‌ సిమ్‌ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించినట్లు మ్యాక్స్‌ సంస్థ ప్రకటించింది. ఇందలో విశేషం ఏముంద‌నుకుంటున్నారా ... ? ఈ బ్యాటరీ సాయంతో ఇతర ఫోన్లను చార్జింగ్‌ చేసుకోవచ్చని మ్యాక్స్‌ సంస్థ తెలిపింది. ఇంకా ఇందులోని ఎల్‌ఈడీ లైటు 10 నిమిషాలు వెలుగుతుంది. డిజిటల్‌ కెమెరా, ఎఫ్‌ఎం రేడియో, జీపీఆర్‌ఎస్‌, ఎంపీ3ప్లేయర్‌తో పాటు 16జీబీ వరకు మెమొరీ పెంచుకునే సౌక‌ర్యం ఉండ‌టం ఈ ఫోన్ ప్రత్యేక‌త‌లు.

  ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్‌ చేయండి!
  జీమెయిల్‌ వాడుతున్నారా? మీ ఇన్‌బాక్స్‌కి ఎక్కువగా ఎటాచ్‌మెంట్‌ ఫైల్స్‌ వస్తుంటాయా? మరి, అవ‌స‌రం అయినప్పుడు వాటిని వెత్తుక్కోకుండా ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్‌ చేసుకోవాల‌ను కుంటున్నారా అయితే సింపుల్‌గా మీకు వచ్చిన ఎటాచ్‌మెంట్‌ ఫైల్‌ ఐకాన్‌పై మౌస్‌ పాయింటర్‌ని ఉంచగానే రెండు గుర్తులు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి 'డౌన్‌లోడ్‌'. దీంతో ఫైల్‌ని సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేయగలరు. రెండోది 'సేవ్‌ టు డ్రైవ్‌' దీనిపై క్లిక్‌ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, త‌రువాత మీకు వ‌చ్చిన ఏ ఫైల్ పైన క్లిక్ చేసినా ఫైల్‌ సరాసరి గూగుల్‌ డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్‌ అయ్యి సేవ్‌ అవుతుంది. ఇక మీదట ఎప్పుడంటే అప్పుడు మీ ఫైల్స్‌ని డ్రైవ్‌ నుంచి యాక్సెస్‌ చేయవచ్చు. డాక్యుమెంట్స్‌ ఫైల్స్‌ అయితే సరాసరి డ్రైవ్‌ నుంచే ఎడిట్‌ చేసి షేర్‌ చేయవచ్చు.
  మీ మొబైల్‌ను క్లీన్ చేసుకోండిలా..!
  సిస్టంలో సీ క్లీనర్‌ మాదిరిగా మొబైల్‌లోనూ అనవసర ఫైల్స్‌ని తుడిచేసే ఆప్‌ ఉంటే బాగుంటుంద‌నుకుంటున్నారా? అయితే, Clean Master ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఈ ఆప్‌ని ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్లికేష‌న్‌ను రన్‌ చేయగానే మొత్తం మొబైల్‌ స్కాన్‌ అవుతుంది. తర్వాత‌ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు Cache, junk ఫైల్స్‌ని స్కాన్‌ చేసి చిటికెలో డీలీట్‌ చేసుకోవ‌చ్చు. దీంతో RAM మెమొరీని పూర్తిస్థాయిలో వాడుకోగ‌లుగుతారు.
  సెర్చ్‌, బ్రౌజింగ్‌ హిస్టరీని క్లీన్ చేయ‌డంతో పాటు 'ఆప్‌ మేనేజ్‌మెంట్‌' ద్వారా కావాల్సిన ఆప్స్‌ని ఇన్‌బిల్ట్‌ మెమొరీ నుంచి ఎస్‌కార్డ్‌ మెమొరీలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అంతే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరంగా రన్‌ అవుతున్న ఫైల్స్‌ని గుర్తించి షట్‌డౌన్‌ చేయ‌డం ఈ ఆప్ ప్రత్యేక‌త‌.
  .
  click here for more details

  'ఆఫీస్' రిమోట్‌

  న్ని పీసీల్లో MS Office త‌ప్పని స‌రిగా ఉంటుంది. కొందరు పాత వెర్షన్లు వాడితే.. చాలా మంది ఎప్పటికప్పుడు సరికొత్త వెర్షన్లకు అప్‌డేట్‌ అవుతుంటారు. మీరు కొత్తగా వ‌చ్చిన MS Office - 2013 వెర్షన్‌ వాడుతున్నారా? అయితే, మీ దగ్గర‌ మొబైల్‌ని రిమోట్‌లా వాడుకుని ఆఫీస్‌ డాక్యుమెంట్స్‌ని యాక్సెస్‌ చేసే స‌దుపాయం ఉన్నట్లే. అందుకోసం సరికొత్త ఆప్‌ని మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. అదే Office Remote. ఆఫీస్‌లోని వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌లను ఫోన్‌ నుంచే యాక్సెస్‌ చేయవచ్చు. ఉదాహరణకు మీరేదైనా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ప్రదర్శించేప్పుడు పీసీ దగ్గరే కూర్చోనక్కర్లేదు. చేతిలో విండోస్‌ మొబైల్‌తో గది మొత్తం తిరుగుతూ ప్రెజంట్‌ చేయవచ్చన్నమాట. ప్రెజంటేషన్‌ని స్టార్ట్‌ చేయవచ్చు. స్త్లెడ్స్‌ని రన్‌ చేయవచ్చు. స్పీకర్‌ నోట్స్‌ చూడొచ్చు. ఇక మీదట లేజర్‌ పాయింటర్‌తో పని లేనట్టే. ఈ ఆప్‌ని కొనాలనుకునేరు. ఉచితంగా అంత‌ర్జాలం నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

  Click here for more details

  స్క్రీన్‌సేవర్‌కు అద‌న‌పు హంగులు
  సిస్టంలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న వాటిని స్క్రీన్‌సేవర్‌గా పెట్టుకోవడం మామూలే. లేదంటే... ఏదైనా యానిమేషన్‌తో కూడిన గ్రాఫిక్స్‌నీ పెట్టుకోవడం చూశాం. ఇవేం కాకుండా మీకు నచ్చిన ఫొటోలను స్క్రీన్‌సేవర్‌గా సెట్‌ చేసుకుని స్త్లెడ్‌షోలా అన్ని ఫొటోలను యానిమేషన్‌ ఎఫెక్ట్‌లతో చూడాల‌నుకుంటున్నారా అయితే మీరు JPEG Saver టూల్‌ను ఉప‌యోగించాల్సిందే.

  ఈ ఆప్లికేష‌న్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. ఈ ఆప్లికేష‌న్ ఇన్‌స్టాల్‌ చేసిన త‌రువాత‌ స్క్రీన్‌సేవర్‌ విండోలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫొటోలు ఉన్న ఫోల్డర్‌ని ఎంపిక చేసుకోవాలి. అందుకు Folders ట్యాబ్‌లోని 'యాడ్‌'పై క్లిక్‌ చేసి ఫోల్డర్‌ని ఎంపిక చేయాలి. డీఫాల్ట్‌గా 'మై డాక్యుమెంట్స్‌'లోని 'మై పిక్చర్స్‌' ఫోల్డర్‌లో ఉన్న వాటిని స్క్రీన్‌సేవర్‌లోకి తీసుకుంటుంది.
  .
  click here for more details
  విండోస్‌ 8 షార్ట్‌క‌ట్స్‌
  మైక్రోసాఫ్ట్‌ విండోస్ 8 వాడుతున్నారా అయితే సుల‌భంగా మీ ఆప‌రేటింగ్ సిస్టంని ఉప‌యోగించుకునేలా కొన్ని షార్ట్‌కట్స్‌ మీ కోసం...
  * ఓపెన్‌ చేసి ఉన్న అన్ని విండోలను మినిమైజ్‌ చేయడానికి Windows +d
  * మై కంప్యూటర్‌ని ఓపెన్‌ చేయాలంటే Windows+e
  * విండోస్‌లోని ఫైల్స్‌ వెతకడానికి Windows+f
  * ఓపెన్‌ చేసిన అప్లికేషన్‌ సెట్టింగ్స్‌ని చూసేందుకు Windows+i .

  * ఓపెన్‌ చేసిన విండోని మినిమైజ్‌ చేయడానికి Windows+ m
  * విండోస్‌ యాక్సెస్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేయాలంటేWindows+u
  * టాస్క్‌బార్‌పై ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్లను ఒక్కొక్కటిగా సెలెక్ట్‌ చేసుకుని చూసేందుకు
  Windows key+ 1, Windows key+2, windows key+3....
  * కీబోర్డ్‌ ఇన్‌పుట్‌ లాంగ్వేజ్‌ని ఎంపిక చేసుకోవడానికి Windows key+Space bar
  * ఎంపిక చేసిన విండోని మ్యాక్సిమైజ్‌ చేయడానికి Windows key+Up Arrow key.

  పెద్ద 'సెంటరే'
  చూడ్డానికి టీవీలా ఉంటుంది. కానీ, అది కంప్యూటరే స్ర్కీన్ సైజ్ ఎంతో తెలుసా? 27 అంగుళాలు. ఈ కంప్యూట‌ర్‌ హెచ్‌డీ టచ్‌స్క్రీన్‌తో పని చేస్తుంది. హోం యూజర్లకు అనువుగా దీన్ని తయారు చేశారు. పేరు Lenovo Idea Centre Horizon. దీన్నీ సాధారణ కంప్యూటర్‌లానే కాకుండా 'టేబుల్‌ టాప్‌' గాను వాడుకోవచ్చు. థర్డ్‌ జనరేషన్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 8 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 1 టీబీ. విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన హెచ్‌డీ వెబ్‌ కెమెరాతో వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు.
  వీడియో గేమ్స్‌ ఆడేందుకు అనువుగా పీసీని రూపొందించారు. వైర్‌లెస్‌ కీబోర్డ్‌, మౌస్‌తో దీన్ని సాధారణ పీసీలా వాడుకోవచ్చు. పీసీతో పాటు కొన్ని గేమింగ్‌ కంట్రోల్స్‌ని కూడా అందిస్తున్నారు. రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, కార్డ్‌ రీడర్‌ సౌకర్యాలు ఉన్నాయి.
  సోషల్‌ కలయిక!
  సోషల్‌ మీడియా అంటే ఛాటింగ్‌లు... షేరింగ్‌లు! లైక్‌లు... కామెంట్‌లు! ఇంతేనా? కాదు.. ఇంకేదో ఉంది! అది తెలియాలంటే Enabli లోకి వెళ్లండి! రోజువారీ జీవితంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అనివార్యమైన అంశంగా మారిపోయింది. ఎన్ని పనులున్నా ఓ కన్ను మాత్రం అటు వేస్తూనే ఉంటాం. ఫేస్‌బుక్‌...ట్విట్టర్‌... గూగుల్‌ ప్లస్‌... వేదిక ఏదైనా పెద్ద కమ్యూనిటీనే ఉంటుంది. వందలు... వేలల్లో పోస్టింగ్స్‌.. ఆప్‌డేట్స్‌. వాటిలో అన్నీ ప్రయోజనకరమైనవి ఉండవు.

  కానీ, అన్ని అప్‌డేట్స్‌ని చూస్తూ బోల్డంత సమయం వృథా చేస్తుంటాం. అలా కాకుండా అన్ని వేదికల‌ను ఒక దగ్గర చేర్చి వాటిల్లో ఏవి ప్రయోజనకరమైనవో సులువుగా బ్రౌజ్‌ చేసి చూడాలంటే? అందుకో ప్రత్యేక వేదిక అవసరమే. అలాంటిదే www.enabli.com. దీని హోం పేజీలో కనిపించే Start Enabling పై క్లిక్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. దీంతో సర్వీసు నిర్వాహకులకు మీరు ఆహ్వానం కోరుతున్నట్టుగా 'ఇన్విటేషన్‌' వెళుతుంది. వెంటనే నిర్వాహకులు మీకో పరీక్ష పెడతారు. మీరు పాస్‌ అయితేనే సైట్‌లో సభ్యత్వానికి అర్హులు. ప్రశ్నలంటే జనరల్‌ నాలెడ్జ్‌ అనుకునేరు. అదేం కాదు... కామన్‌ సెన్స్‌ ప్రశ్నలు. కేవలం మీరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునే ప్రశ్నలు. వాటికి తడుముకోకుండా సమాధానాలు అందిస్తూ వెళ్లాలి. మొత్తం పూర్తియ్యాక మీ ఫలితాన్ని తెలియజేస్తూ సభ్యత్వాన్ని అందిస్తారు. అంటే సోషల్‌ లైఫ్‌లో మీకంటూ కొంత ప్రత్యేక జాగా క్రియేట్‌ అయినట్టే అన్నమాట. ఇక మీరు అన్ని నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని ఒక ప్రత్యేక మెయిల్‌లో చూడ‌వ‌చ్చు. రోజుకో మెయిల్‌ రూపంలో నెట్‌వర్క్‌లోని సభ్యుల 'ముఖ్యమైన రిక్వెస్ట్‌'లను పంపుతారన్నమాట. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లోని మీ నెట్‌వర్క్‌ సభ్యుల్లో ఎవరైనా రక్తం అవసరమని చేసిన పోస్ట్‌ కచ్చితంగా రిక్వస్ట్‌ల జాబితాలో ఉంటుంది. మరి, మీకు సాయం కావాలన్నా... మీరు సాయం చేయాలన్నా ఈ వేదికపై చేతులు కలపండి.
  ఇవిగో ఎఫ్‌బీ షార్ట్‌కట్స్‌!
  మీకు తెలుసా ఫేస్‌బుక్‌లోనూ పీసీలోలా సులువుగా కావాల్సిన పనిని షార్ట్‌కట్స్‌తో చేసుకోవ‌చ్చు. ఉదాహరణకు మీరు ఎక్కడున్నా ఫేస్‌బుక్‌ హోం పేజీకి రావాలంటే? Alt+1 నొక్కితే సరి.
  ఇలాంటి మ‌రిన్ని షార్ట్‌కట్స్‌ మీకోసం
  * మీ ప్రొఫైల్‌ పేజీని చూడాలంటే Alt+2
  * మీకు వచ్చిన ఫ్రెండ్స్‌ రిక్వస్ట్‌లను చూసేందుకు
     Alt+3
  * మెసేజ్‌లు ఏమేమి వచ్చాయో చూసేందుకు Alt+4
  * మీకొచ్చిన మొత్తం నోటిఫికేషన్స్‌ని చూడాలంటే
     Alt+5
  * ప్రొఫైల్‌ ఎకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లేందుకు Alt+6

  * ఎకౌంట్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌ కోసం Alt+7
  * ఫేస్‌బుక్‌ 'ఎబౌట్‌ ఆజ్‌' పేజీని చూసేందుకు Alt+8
  * ఫేస్‌బుక్‌ terms and conditions చూసేందుకు Alt+9
  * హెల్ప్‌ సెంటర్‌ పేజీ కావాలంటే Alt+0 (zero)
  * ఎవరికైనా కొత్త మెసేజ్‌ను పంపేందుకు Alt+m నొక్కండి.
        ఈ షార్ట్‌కట్‌లను క్రోమ్‌లో ఎలాంటి మార్పు లేకుండా వాడొచ్చు. ఒకవేళ ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే Alt మీటకి బదులుగా Shift+Alt మీటల్ని కలిపి నొక్కండి. మ్యాక్‌లో ఫేస్‌బుక్‌ని వాడితే Alt స్థానంలో Ctrl+Opt మీటల్ని కలిపి నొక్కండి. ఇంకెందుకు ఆల‌స్యం వీటిని ఉప‌యోగించి ఎఫ్‌బీలో మీకు కావాల్సిన ప‌నిని సులువుగా చేసుకోండి.

  రెండు తెర‌ల ట‌చ్ ఫొన్‌
  రెండు తెరల టచ్ అండ్ టైప్ స్మార్ట్ఫోన్ 'గెలాక్సీ గోల్డెన్ ఫోన్'ను శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ఫ్లిప్ (మడిచే వీలున్న) పద్ధతిలోని ఈ ఫోన్కు పైన, లోపల సూపర్ అమోల్డ్ తాకేతెరలు, కింది భాగంలో బటన్స్ ఉంటాయి. బయటి తెర సాయంతో కాల్స్ చేసుకోవచ్చు, అందుకోవచ్చు. 1.7 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్-1.9 మెగాపిక్సెల్ కెమెరాలు, 16 జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ సాఫ్ట్వేర్తో పనిచేస్తుంది. హిడెన్ రిసీవర్ వల్ల రణగొణ ధ్వనుల మధ్య కూడా ఫోన్కాల్ స్పష్టంగా వినే అవకాశం ఉండటం ఈ ఫొన్ ప్రత్యేకత.

  బ్రౌజ‌ర్ హ్యాంగ్ అయిందా..!
  సిస్టంలో ఓపెన్‌ చేసిన ఏదైనా ప్రోగ్రాం హ్యాంగ్ అయితే ఏం చేస్తాం? టాస్క్‌ మేనేజర్‌లోకి వెళ్లి సమస్యకి కారణమైన అప్లికేష‌న్‌ని క్లోజ్‌ చేస్తాం. అలాగే క్రోమ్ బ్రౌజ‌ర్‌లోనూ చేయ‌వ‌చ్చు. ఎక్కువ ట్యాబ్స్‌ని ఓపెన్ చేసిన‌ప్పుడు వాటిలో ఏదైనా ఎక్కువగా మెమొరీని తీసుకుంటే బ్రౌజర్‌ హ్యాంగ్ అవుతుంది. అప్పుడు Shift+Esc మీటల్ని నొక్కితే క్రోమ్ Task Manager ఓపెన్ అవుతుంది.
  మొత్తం ట్యాబ్‌లు ఆయా ఐకాన్‌ గుర్తులతో కనిపిస్తాయి. ఓపెన్‌ చేసిన వెబ్‌ సర్వీసులు ఎంతెంత మెమొరీ తీసుకున్నాయో చూడొచ్చు. ఏదైనా అక్కర్లేని ట్యాబ్‌ని క్లోజ్‌ చేయాలంటే సెలెక్ట్‌ చేసి End Process పైన క్లిక్‌ చేస్తే సరి స‌మ‌స్య తీరిపొతుంది.
  అప్పటికప్పుడే "ఫిల్టర్‌" చేయండిలా..!
  కాలంలో బ్యాంకు ఎకౌంట్‌ లేకపోయినా వింత కాదుగానీ... జీమెయిల్‌లో ఎకౌంట్‌ లేదంటే వింతే. నెటిజన్‌గా మారిన ప్రతి సిటిజన్‌ కచ్చితంగా జీమెయిల్‌ వాడుతుంటారు. అన్ని మెయిల్‌ సర్వీసుల్లో మాదిరిగానే జీమెయిల్‌లో కూడా ప్రమాదకరమైన మెయిల్స్‌కి స్పాం విభాగం ఉంటుంది. అలాంటి మెయిల్స్‌ ఆటోమాటిక్‌గా స్పాంలోకి వెళ్లేలా సౌక‌ర్యం ఉంటుంది. నిర్ణీత సమయం తర్వాత వాటిని మ‌నం డిలీట్‌ చేస్తుంటాం.
  అలా కాకుండా స్పాంకి చేరే మెయిల్స్‌ని అప్పటికప్పుడే డిలీట్ అవ్వాల‌నుకుంటున్నారా అయితే మీరు 'ఫిల్టర్‌'ని సెట్‌ చేసుకోవాలి. మెయిల్‌లోకి లాగిన్‌ అయ్యాక Settings లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే మెనూల్లోని Filters పై క్లిక్‌ చేసి Create a new filter ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన విండోలోని Has the words బాక్స్‌లో in:spamటైప్‌ చేసి Next Step లోకి వెళ్లండి. అక్కడ వచ్చిన వాటిల్లో Delete it ఆప్షన్‌ని చెక్‌ చేయండి. అలాగే, Also filter to 0 matching conversations ఆప్షన్ని చేసి 'క్రియేట్‌ ఫిల్టర్‌'ని ఎంచుకోవాలి. దీంతో స్పాంకి మీరు పెట్టుకున్న ఫిల్టర్‌ క్రియేట్‌ అవుతుంది. ఇక మీదట స్పాం విభాగం ఎప్పటికప్పుడు క్లియర్‌ అవుతుంది. ఫిల్టర్‌ మెనూలోకి వెళ్తే క్రియేట్‌ చేసిన స్పాం ఫిల్టర్‌ కనిపిస్తుంది. ఏమైనా మార్పులు చేయాలంటే 'ఎడిట్‌' ఉంది. అక్కర్లేదనుకుంటే 'డిలీట్‌' చేయవచ్చు.
  Eight times faster Air
  Apple introduces the new  iOS  iPad Air tablet on 22nd October 2013 the iPad Air will go on sale 1st November. It is eight times faster than the original iPad that came out in 2010. iPad Air have fingerprint resistant oleo phobic coating the iPad Air features a thinner design with similarities to the iPad Mini along with iOS 7 and the 64-bit Apple A7 processor. The iPad’s market share has been eroding compared with cheaper rivals running Google’s Android operating system.

  Music mixing
  Music Maker app is a digital music editor, which was designed by the company Magix for the consumer sector. Music Maker makes it easy to start playing with music and mixing your own songs. it is most successful music editor from the start screen chose a music style and begin mixing instrument loops to create your unique combination of sounds.


  వై-ఫై బదులు లై-ఫై!
  బీజింగ్‌: ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యే వినూత్న విధానాన్ని చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. కాంతి కోసం ఉపయోగించే బల్బుల ద్వారా నెట్‌ సంకేతాలను చేరవేయడం ఇందులోని ప్రత్యేకత. ఇది ఆన్‌లైన్‌ అనుసంధానతలో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వై-ఫైలో రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా సంకేతాలను చేరవేస్తారు.

  కొత్త విధానంలో వీటికి బదులు కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. నాలుగు కంప్యూటర్లను 1వాట్‌ ఎల్‌ఈడీ బల్బుతో ఇంటర్నెట్‌కు అనుసంధానం చేయవచ్చు. ఈ కొత్త పరిజ్ఞానాన్ని లై-ఫైగా పిలుస్తున్నారు. మైక్రోచిప్‌లు కలిగిన ఒక బల్బు.. సెకనుకు 150 మెగా బిట్ల డేటాను చేరవేయగలదు. వచ్చే నెల 5 నుంచి షాంఘైలో జరిగే చైనా అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శనలో లై-ఫై కిట్లను ప్రదర్శించనున్నారు.
  Switch your favorite network
       A WiFi Manager is a piece of software that manages the activities and features of a wireless network connection. It may control the process of selecting an available access point, authenticating and associating to it and setting up other parameters of the wireless connection. This app improve connection quality with a graphical channel radar. Discover open networks around you. Includes home screen widgets one displays detailed connection info, another lets you switch among your favorite networks with a single tap and yet another toggles WiFi Access Point.


  Click here for more details
  App for Architecture Students
       AutoCAD 360 is the new app for Architecture students. Easy-to-use this drawing and drafting mobile app that allows you to view, edit and share. AutoCAD drawings anytime, anywhere. Simplify site visits and fieldwork with powerful design review and markup tools available online and offline. Seamlessly share drawings with others across desktop, web and mobile devices. You can easily access drawings from web browsers using the free companion AutoCAD 360 web app.

  Click here for more details
  A Tablet for your Kid..
       Electronics company Binatone has launched it's first android-based tablet "App star". It designed for kids above 4 years old. App. star is packed full of software suitable for children of 4 years and above. It has pre-loaded fun games, educational apps, art studios, e-books, audio-books, music player and camera with video recorder.
  The tablet has Wi-Fi connectivity and a battery back of up of 4 hours. Featuring Wi-Fi connectivity and parental controls, as well as 250 pre-installed apps and a front-facing camera and motion sensor, this tablet, which is aimed at kids aged four and up is great for playing music, videos and games and can help with everything from speech and language development to encouraging creativity.
  Telugu Dictionary on your mobile
       English to Telugu Dictionary is a handy app featuring 40,000+ English words and their meanings in Telugu language. This is very use full app for students. The dictionary shows Telugu meanings in clear Telugu font. Use the search function to navigate to a term or simply tap on the English word field to get the Telugu description.
  Click here for more details
  Find the Perfect spot
       Explore new places, discover local favorites and navigate your world with Google maps. This is the best and essential app for you. This app is work on Android phones and tablets. App specialties are get where you need to go quickly with voice guided turn-by-turn GPS navigation or try public transit, biking and walking directions. Find the perfect spot for any occasion with local reviews from trusted friends and experts. You can make a map area available offline by tapping the search box and selecting “Make this map area available offline” Visit http://goo.gl/wawgE to learn more.
  Click here for more details
  Trendy Champion
       The BSNL-Champion Trendy 531 phablet launched by the Champion Computers and BSNL. The device is powered by Android 4.2 Jelly Bean and comes with a 500 MB free BSNL 3G data plan per month for a period of one year. The BSNL-Champion Trendy 531 shows off a 5.3 inch IPS display whose resolution is not known.
  A 1.2 GHz quad-core processor along with 1GB of RAM powers it. The device boasts of dual-SIM capabilities and 13 MP camera with a flash and the front has a 5 MP camera for video calling. The phablet is available for Rs.13,999.
  Click here for more details
  అదనపు హంగులు
       స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉందంటే ఫొటోలే.. ఫొటోలు. ఇన్‌బిల్ట్‌గా ఉన్న ఎఫెక్ట్‌లే కాకుండా మరిన్ని కొత్తవి కూడా ప్రయత్నించ‌వ‌చ్చు. అందుకు అనువైన ఆప్స్‌ చాలానే ఉన్నాయి. వీటిలో Photo Wonders ఒకటి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆప్‌ని నిక్షిప్తం చేసుకున్నాక ఫొటో గ్యాలరీ నుంచి ఫొటోలను సెలెక్ట్‌ చేసుకుని ఎఫెక్ట్స్‌ని అప్త్లె చేయవచ్చు. 30 రకాల ఫొటో ఎఫెక్ట్‌లు ఉన్నాయి. కెమెరాతో ఫొటోలు తీసేప్పుడే ఎఫెక్ట్‌లను ఆప్త్లె అయ్యేలా చేయవచ్చు. ఫేస్‌బుక్‌లోని ఫొటోలను కూడా మార్పులు చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసే ముందు లేటెస్ట్‌ యాంటీ వైరస్‌తో స్కాన్‌ చేయడం మర్చిపోవద్దు. కావాలంటే http://goo.gl/LQoqH1 లింక్‌ నుంచి ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.
  Click here for more details
  పది నిమిషాల్లోనే మొబైల్ ఛార్జింగ్‌!
       ఫోన్‌ ఛార్జ్ అవడానికి ఎంత సమయం పడుతోంది? ఇంచు మించు గంట లేదంటే రెండు గంటలు. మరి, పది నిమిషాల్లో మొబైల్‌ ఛార్జ్‌ అయితే? రోజంతా ఫోన్‌ను వాడుకుంటే? అలాంటి ఫోన్‌ ఒకటి ప్రపంచ మార్కెట్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. అదే జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ కంపెనీ రూపొందించిన Arrows A301F మొబైల్‌. మరో అదనపు సౌకర్యం ఏంటంటే... ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్న 'ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌'. మీ వేలి ముద్రని రీడ్‌ చేయడం ద్వారా ఫోన్ని 'ప్రైవసీ మోడ్‌'లో సెట్‌ చేసుకోవచ్చు. అంటే మీ వేలి ముద్ర లేనిదే మొబైల్‌ని వాడడం అసాధ్యం. 5 అంగుళాల తాకే తెరతో ఫోన్‌ని రూపొందించారు.వేగంగా ఛార్జ్‌ అయ్యేందుకు Quick Charge 2.0 టెక్నాలజీని వాడారు. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.http://goo.gl/u85XfG

  Click here for more details
  Easy to combine one or more photos
       With "PhotoShake", you can easily combine one or more photos to make exciting and fun new images. "PhotoShake" is a photo editing program that you can use to share photos with family and friends on social networking sites."PhotoShake" allows user to create images from various occasions
  like everyday life, memorable moments, social gatherings, photo that has a story.
  Click here for more details
  Beautiful fonts on your phone
      The app is designed to install beautiful fonts on your phone. You can download and use hundreds of fonts to cutify your phone. It 's easy to change system font in your mobile. you want let your phone has become distinctive as well as more beautiful? It 's easy to change system font.
  Integrated hundreds of exquisite lovely font, easily change the system font. Font blossoms, personalized I dominate so monotonous phone interface look let you have a happy mood every day, love life, love fonts.Font blossoms, personalized I dominate. So monotonous phone interface look let you have a happy mood every day.
  Click here for more details
  An anti-theft application!
      Are you a victim of theft... Now no need to pray for God! Believe in Prey..
  Prey is the most complete anti-theft application. It lets you track and locate your lost or stolen phone, tablet and laptop. It will locate and recover your device with geolocation and many more features.
  Prey is 100% free and you can protect up to 3 devices with one single account. By using this app remotely control your android phone and tablet online. Once you log into Prey you can do the following...
  * Find your phone on a map through geolocation using both GPS and WiFi triangulation.
  * Take pictures using the built-in front and back camera.
  * Lock your device from any unwanted intruder.
  * Trigger a loud alarm remotely even if your phone is put on silent.
  * Display a tailored alert message on the screen.
  * Gather the network information that your device is connected to (for accurate pinpointing).
  Click here for more details
  New Font Designs for DTP
      Are you searching for new font designs in DTP? let use this NexusFont manager. This is a font manager that enables you to preview and compare selected font types, install and uninstall fonts on your system, find duplicate fonts and more.You can preview fonts with different font styles, colors and even anti-aliasing, using a user defined sample text.
  The preview list can be printed or saved as image file in various formats. Other features include font management (copy, move, delete, rename), user list of favorite fonts, print preview and more.
  Click here for more details
  Microsoft introduced Surface 2 series
      Microsoft announced two new Surface models Surface 2 and Surface Pro 2 along with an expanded portfolio of new Surface accessories, will be available at Microsoft retail. Surface 2 and Surface Pro 2 each benefit from significant updates, including improvements to processing power and battery life,
  to display and camera resolution and to the kickstand, now with dual angles. So it is more comfortable to use. Enhancements in Windows RT 8.1 and Windows 8.1 pro make Surface 2 and Surface Pro 2 even more powerful and customizable.
  Click here for more details
  Digitise Your Study Plan!
      One good application ‘Study Planner’ is available on web to help you in your studies and to make effective utilization of your time. In this app you can enter your timetable, homework, class work and exams details etc. It is very simple to use and it provides useful information to you. If you tap on a subject, you will see all the home works, class works and exams for that subject as well as when you have that subject next.The first thing you see when you start Study Planner is the Upcoming Feed which shows all the lessons,
  home works and exams which need to be done soon. The Live Tile automatically updates with your next lesson if you're in school or the number of home works you have for tomorrow if you've finished school. It works with Windows Phone 8 and Windows Phone 7.5.
  Click here for more details
  The combination of three
      Generally we use Google, Yahoo, Bing etc. search engines to search any information on internet all the results displayed by those engines are not same . some results are shown by one engine and the some are not. we can avoid this type of inconvenience by using "webcrawel" . We use this webcrawler all the results displayed by the above three engines are shown in one window at a time.
  Click here for more details
  ఆన్‌లైన్‌లోనే నేర్చుకుందా
      కంప్యూటర్‌ని వాడుతున్నారా? కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో టెక్నాలజీ పదాల అర్థం తెలియడం లేదా? అయితే, www.webopedia.com గురించి తెలుసుకోవాల్సిందే. రోజుకో పదం చొప్పున కంప్యూటర్‌ పదజాలాన్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. కావాల్సిన అంశాన్ని సెర్చ్‌బాక్స్‌ ద్వారా వెతకొచ్చు. టెక్నాలజీ ట్రెండ్స్‌లో ఎక్కువగా తారసపడే అంశాల్ని 'టాప్‌ టెర్మ్స్‌'లో పొందొచ్
  Click here for more details
  ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ పాఠాల కోసం...
      బీటెక్‌ విద్యార్థులకు, ముఖ్యంగా గేట్‌కు ప్రిపేర్‌ అవుతున్నవారికి ఉపయోగపడే వెబ్‌సైట్లలో ప్రధాన‌మైంది http://nptelm ఇంజినీరింగ్‌ చదువులకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. దీని ద్వారా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ కోర్సును కూడా అందిస్తున్నారు. ఆడియో, వీడియో రూపాల్లో పాఠాల‌ను అందిస్తున్నారు. ఈ పాఠాల‌కు సంబంధించిన వీడియోల‌ను యూట్యూబ్‌లోనూ వీక్షించే సౌల‌భ్యం ఉంది. కావాల్సిన వీడియోని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
  Click here for more details
  టెక్నాలజీపై అవగాహన పెంచుకోండిలా..!
      టెక్నాల‌జీకి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడూ పొందాల‌నుకుంటున్నారా..? అయితే www.cnet.com వెబ్‌సైట్ చూడండి. దీని ద్వారా టెక్నాలజీ రివ్యూలు, వార్తాంశాలను తెలుసుకోవ‌చ్చు. వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ కూడా చేసుకోవ‌చ్చు. టెక్‌ వీడియోలను చూసేందుకు Cnet TV విభాగం ఉంది. కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన అన్ని గ్యాడ్జెట్‌లపై రివ్యూల‌ను చూసేందుకు ప్రత్యేకంగా Reviews మెనూ ఉంటుంది. పీపీ, మ్యాక్‌, మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
  Click here for more details
  A bit arty ...
      With "PhotoShake", you can easily combine one or more photos to make exciting and fun new images. "PhotoShake" is a photo editing program that you can use to share photos with family and friends on social networking sites. "PhotoShake" allows user to create images from various occasions like everyday life, memorable moments, social gatherings, photo that has a story.
  Click here for more details
  ప్రత్యేక నెట్‌వర్క్‌
      వ్యక్తిగత, వ్యాపార, చదువు, ఉదోగ్యం ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలతో సైట్‌ మాదిరిగా నెట్‌వర్క్‌ను రూపొందించుకోవాలనుకుంటే Collectivex సర్వీసులో సభ్యులవ్వండి. నచ్చిన అంశాలపై చర్చల్ని, గ్రూప్‌ బ్లాగ్‌, ఫైల్‌ స్టోరేజ్‌, ఫొటో గ్యాలరీ సదుపాయాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంశాలన్నింటినీ Work, Life, Balance అంటూ మూడు విభాగాలు విభజించారు. ఇతర వివరాలకు www.collectivex.com
  Click here for more details
  మీ ఫొటో పై మీ ముద్ర వేయండిలా...
      మీరు తీసిన ఫొటోలను మీ సంతకంతోనో, మరేదైనా సింబల్‌తోనో వాటర్‌ మార్క్‌ చేయాలంటే అందుకు సాఫ్ట్‌వేర్‌ కొనక్కర్లేదు. My Watermark టూల్‌ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఫొటో పరిమాణం ఆధారంగా టెక్స్ట్‌ ఆటోమాటిక్‌గా సెట్‌ అవుతుంది. 'బ్యాచ్‌ ప్రాసెస్‌'తో ఫొల్డర్‌లోని అన్ని ఫొటోలకు ఒకేసారి వాటర్‌మార్క్‌ని అప్లె చేయవచ్చు. ఫుల్‌ జూమ్‌తో ఫొటోలను ప్రివ్యూ చూడొచ్చు. టూల్‌ని రన్‌ చేయాలంటే సిస్టంలో మైక్రోసాఫ్ట్‌ డాట్‌నెట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ఉండాల్సిందే. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gle/xygPM
  Click here for more details
  ఎడిటింగ్‌తో పాటు ప్లే చేసుకోవచ్చు!
      ఫొటోలను ఎడిట్‌ చేయాలంటే ఎక్కువగా ఫొటోషాప్‌ లాంటి అప్లికేషన్లనే వాడతాం. కానీ, ఫొటోషాప్‌లో వీడియో ఫైల్స్‌ని ప్లే చేసి చూడగలరా? దాన్ని సాధ్యం చేసే సాఫ్ట్‌వేర్‌ ఒకటుంది. ఫొటోలను ఎడిట్‌ చేసుకోవడంతో పాటు వీడియో, ఆడియో ఫైల్స్‌ని ప్లే చేసి చూసుకునే వీలు కల్పించే దాని పేరే FreeVimager. ఫొటోల ఎడిటింగ్‌కు Rotate, Resize, Adjust Brightness, Red Eye... లాంటి ఆప్షన్లు ఉన్నాయి. ఫొటోలకు బోర్డర్లను పెట్టుకునే వీలుంది. ఎడిట్‌ చేసిన ఫొటోలను పీడీఫ్‌ ఫార్మెట్‌లో సేవ్‌ చేసుకోవచ్చు కూడా. 'ఓపెన్‌ డాక్యుమెంట్‌'తో వీడియో, ఆడియో ఫైల్స్‌ని ప్లే చేసుకోవచ్చు. వీడియో ఫైల్‌ని 'పాజ్‌' చేసి కావాల్సిన సన్నివేశాన్ని 'శ్నాప్‌షాట్‌' ద్వారా ఇమేజ్‌ ఫైల్‌గా మార్చుకోవచ్చు. http://goo.gl/Pevcb
  Click here for more details
  One more tool to edit your images!
      There are so many free tools are available in the internet to edit your photos. Now one more special tool PhotoFiltre7 is ready for you. It needs no installation. Just run one EXE file on your system. You can use it from your pen drive also. This tool is offering all the standard photo editing features like selection, clone brush, paint brush etc. Large selection of image effects, photo masks, image adjustments, thumbnail browser and many more are also available in this tool. Nice smoothing, lots and lots of fun filter options make you enjoy photo editing. Any photo format can be supported by this tool. You can use batch processing to apply filters, sizing, adjustments and transformations to a large number of images at a time
  Click here for more details
  Convert your photo into sketch
      If you upload your photos to FotoSketcher, it will automatically change your photo into a pencil sketch. When you run this program it will avail so many tools on your tool bar. Picture option enables you to select a photo. Once you select image ‘drawing parameters’ will appear on the screen. Drawing sttel, Edge intensity, Color intensity, Darken, Contrast are some other options that you can set to draw a photo. After completion of options setting you have to click on draw button. Then your photo will be changed into a sketch. You can also place the desired text on the sketch.
  Click here for more details